Site icon Sanchika

ధనము

[dropcap]ధ[/dropcap]నము అను మాట అనక, వినక, కానక
జరుగు సకల కార్యముల్ సుకృతముగా

ధనము అను మొదలు మెదిలిన మెదడులో
అది బీజముగా మారును సంపాదించుటకు మార్గాలు
ధనము ఇచ్చుటకు తప్పించుకొను దారులు

ఓం నమః శివాయ అను అక్షరములనందురు
షడంగ బీజములు మరి
లోకాభివృధ్ధికి, లోకనాశనానికి మూలమైన ఈ
ధనమును ఎటుల వర్ణించవలెను??
ఎన్నో బీజముగా??? బీజాంకురముగా???

నేటి కాలమున పచ్చనోటు మారెను పచ్చ తోరణముగా
ఈ తోరణముల పచ్చదనము నిలుపుటకు
ధనవంతులు చేస్తున్నారు నిలువు దోపిడీలు
వాటితో వెలవెలబోతున్నై బీదల ఇళ్ళు

మంచితనమునకు పోయి ఉపకారము ఒనర్చ
ఏ ధనము ఆశింపక కార్యము తలపెట్టినచో
జరుగు కార్యమును పరీక్షింప
వచ్చెదరు బహుజనులు వీక్షించి పోయెదరు

చేసిన కార్యము విలువ ధనము ఆశించినా
తెలివైన వారు మాట నెట్టేస్తారు తప్పించుకుంటారు
అతి తెలివైన వారు ఒప్పుకుంటుంటారు ఒప్పందం కూర్చరు

ధనాపేక్షతో స్వదేశీయులు
మారుతున్నారు ప్రవాసస్థులుగా

ఆర్జించినా ధనముతో సంతృప్తి చెందిన
నిలుచు సకల బంధాలు
నిలువచేయును మనో శాంతి

ధనాశ మారిన అత్యాశగా
అది తొలి అడుగు అగును
మన దారిని దారి మళ్ళించుటకు
మామూళ్ళ వసూళ్ళకు, బల్ల కింద చేతులకు

ధన వ్యామోహం తెంచుతున్నది పేగు బంధాలు
వీడిపోయేలా చేస్తోంది దైవ కృత శక్తులను
అఋణీచలను మార్చును ఋణీచలుగా

ధనావసరాలు అమ్ముకునేలా చేస్తున్నై
సొంత అవయవాలను, మేని అందాలను
మోయిస్తున్నై ఇతరుల బిడ్డల బరువును
అమ్మను కొనేలా చేస్తున్నాయి

ఎల్లపటికి, ఎల్లవేళలకు
అక్రమ సంపాదన నిలజాలదు కాని
ధనార్జన ఎరుగక చేసిన విద్యాదానం
మరువలేరు, అభివృధ్ధి చెందు

 

Exit mobile version