[box type=’note’ fontsize=’16’] బాల పాఠకుల కోసం ధృవుడి కథను సరళమైన రీతిలో అందిస్తున్నారు బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box]
[dropcap]స్వా[/dropcap]యంభువ మనువుకు శతరూప అనే భార్యవలన ప్రియవ్రతుడు- ఉత్తానపాదుడు అనే ఇరువురు పుత్రులు జన్మించారు. వీరిలో ఉత్తానపాదునికి సునీతి – సురుచి అనే యిరువురు భార్యలు. వీరిలో సురుచి అంటే మిక్కిలి ప్రేమగా ఉండేవాడు. ఒకరోజు సురుచి కుమారుడు ఉత్తముడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఆడిస్తూ ఉండగా సునీతికి జన్మించిన ధృవుడు తనూ కూడా తండ్రి ఒడిలో ఆడుకోవాలని ఉబలాట పట్టాడు. అది చూసిన సురుచి ‘నా బిడ్డకు మాత్రమే అలా ఆడుకునే అర్హత ఉంది. వెళ్ళు’ అని ధృవుని అడ్డగించింది.
పినతల్లి మాటలకు మనసు గాయపడిన ధృవుడు నారదమహర్షి ఉపదేశించిన మంత్రంతో తన తల్లి ఆశీర్వాదంతో యమునానది తీరాన ఉన్న మధువనం చేరి మొదటి మాసం నేరేడుపండ్లు-వెలగపండ్లు; రెండో మాసం ఆరుదినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను-మూడవ మాసం తొమ్మిది దినాలకు ఒకసారి నీటిని స్వీకరిస్తూ,నాల్గవ మాసం పన్నెండు దినాలకు ఒకసారి గాలి పీల్చుతూ అయిదవ మాసం అన్నివదలి ఒంటికాలిపై నిలచి శ్రీమహవిష్ణువుని ధ్యానించాడు. అతని భక్తికి మెచ్చిన విష్ణువు ‘చిరంజీవి నీ తపస్సు ఫలించింది. జ్యోతిశ్చక్రము, నక్షత్రస్వరూపాలైన థర్ముడు-అగ్ని-కశ్యపుడు-శుక్రుడు- సప్తమహర్షులు అయిన వసిష్ఠ-అత్రి-గౌతమ-కశ్యప-భరధ్వాజ- జమదగ్ని-విశ్వామిత్రులు తారకులతో కూడి దేనికి ప్రదక్షణం చేస్తుంటారో అటువంటి ‘ధ్రువక్షితి’ అనే నక్షత్రంగా వెలుగొందుతావు, కొంతకాలం తరువాత నీ తండ్రి తపస్సుకై వనదీక్ష చేపడతాడు. వేటకు వెళ్ళిన నీ తమ్ముడు ఉత్తముడు అక్కడే మరణిస్తాడు. అతని కొరకు వెదుకుతూ వెళ్ళిన అతని తల్లి సురుచి అడవిలోని కారు చిచ్చులో చిక్కిమరణిస్తుంది. నువ్వురాజ్యానికి వెళ్ళు’ అని విష్ణువు వెళ్ళిపోయాడు.
కొంతకాలం తరువాత ధృవునికి పట్టాభిషేకం చేసిన ఉత్తనపాదుడు తపస్సుకై వనాలకు తరలివెళ్ళాడు. అలా శింశుమార ప్రజాపతి కుమార్తె భ్రమిరిని వివాహం చేసుకున్నాడు. వారికి కల్పుండు-వత్సరుడు-మరో భార్య వాయుదేవుని పుత్రిక ఇలకు ఉత్కలుడు అనే కుమారునితో పాటు ఒక కుమార్తె, ధన్య అనే భార్యకు శిష్టుడు, శంభువు అనే భార్యకు భవ్యుడు –శ్లిష్టి అనే వారులతో పాటు గర్కుడు-వృషభుడు-వృకుడు-వృకలుడు-థ్రతిమంతుడు-అనే కుమారులు జన్మించారు. చాలాకాలం రాజ్యపాలన చేసిన ధృవుడు తన తల్లి మరణానంతరం బదరికావనం చేరి శ్రీహరిని స్మరిస్తూ నక్షత్రమండలంలో శాశ్వత స్ధానం పొందాడు.