ధ్రువుని సంతతి

0
2

[box type=’note’ fontsize=’16’] బాల పాఠకుల కోసం ‘ధ్రువుని సంతతి’ కథను సరళమైన రీతిలో అందిస్తున్నారు బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box]

[dropcap]స్వ[/dropcap]యంభువమనువుకు శతరూపా అనే భార్యకు ప్రియవ్రతుడు-ఉత్తానపాదుడు అనే యిద్దరు పుత్రులు. యిందులో ఉత్తానపాదుడికి సునీతి-సురుచి అనే యిరువురు భార్యలు. వీరిలోసునీతకు జన్మించినవాడు ధృవుడు.  యితను వాయుదేవుని పుత్రిక ఇలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఉత్కలుడు అనే కుమారుడు జన్మించాడు. భ్రమిరి అనే మరో భార్యకు కల్పుండు, వత్సరుడు; ధన్య అనే భార్యకు శిష్టుడు, శంభువు అనే భార్యకు భవ్యుడు, మరియు గర్కుడు, వృషభుడు, వృకుడు, వృకలుడు, ధ్రతిమంతుడు అనే కుమారులు కలిగారు. వీరిలో ధృవుని అనంతరం వత్సరుడు రాజ్యభారం చేపట్టాడు. ఇతని భార్య సర్వర్ది. వీరికి పుష్పార్ణుడు, చంద్రకేతుడు, ఇష్టుడు, ఊర్జుడు, వసువు, యుడు అనేవారు జన్మించారు. వీరిలో పుష్పార్ణునికి ప్రభ, దోష అనే యిరువురు భార్యలు ఉన్నారు. ప్రభకు ప్రాతర్మ-థంధని-సాయిలు అనే ముగ్గురు పుత్రులు. దోషకు ప్రదోషుడు-నిశీధుడు-వ్యుష్టుడు అనేవారు జన్మించారు. ఇందులోవ్యుష్టుడి భార్య పుష్కరిణి.  వీరికి సర్వతేజుడు జన్మించాడు. ఇతని భార్య ఆకూతి. వీరికి చక్షస్సు అనే మనువు జన్మించాడు. ఇతని భార్య నడ్వల. వీరికి పురువు-కుత్సుడు-ద్యుమ్నుడు-సత్యవంతుడు-బతుడు-వ్రతుడు-అగ్నిప్టోముడు-అతిరాత్రుడు-సుద్యముడు-శిబి-ఉల్మకుడు అనేవారు జన్మించారు. వీరిలో ఉల్మకునకు అంగుడు-సుమనుడు-ఖ్యాతి-కత్రువు-అంగీరసుడు-గయుడు జన్మించారు. అంగుడు సునీథ దంపతులకు వేనుడు జన్మించాడు. అతని ప్రవర్తన నచ్చని అంగుడు అడవులకు వెళ్ళిపోయాడు, అది తెలిసిన మునులు శపించగా వేనుడు మరణించాడు. వేనుడు శరీరం నుండి మునులు నారాయణ అంశంతో బాలుని సృష్టించారు. అతని పేరు పృథుడు. ఇతను తొలి చక్రవర్తిగా గుర్తింపు పొందాడు. ఇతని పట్టాభిషేకానికి కుబేరుడు బంగారు సింహసనం, వరుణుడు చంద్రకాంతులు వెదజల్లే ఛత్రం, వాయుదేముడు వింజామరము, ధర్మదేవత యశోరూపమైన యముడు రాజదండము, బ్రహ్మదేవుడు వేద కవచాలు, సరస్వతిదేవి మంచి ముత్యాలదండను, పూలమాలను, ఇంద్రుడు కిరీటం, లక్ష్మిదేవి తరగని సంపదను, శివుడు ఖడ్గాన్ని, పార్వతిదేవి శతచంద్రా అనే డాలును, చంద్రుడు తెల్లని గుర్రాలను, త్వష్ట అందమైన రథాన్ని, సూర్యుడు శరాలను, సూర్యుడు అజగవం అనే ధనస్సును, భూదేవి యోగమాయలైన పాదుకలు బహుకరించారు. పృధు భార్య అర్చి. ఈ దంపతులు నిత్యం హరినామస్మరణతో వంద అశ్వమేధ యాగాలు చేసి సనత్కుమారుడి ద్వారా జ్ఞానభోధ పొంది స్వర్గం చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here