Site icon Sanchika

దోమకు దండం

 

చిట్టి దోమ
కుట్టే దోమ
గీ… పెట్టే దోమ
నీవంటే మాకు లేదు ప్రేమ
నీవుంటేనే మాకెంతో శ్రమ
నీ నిర్మూలనే మాధ్యేయం
అందుకోసం పెడతాము ధూమం
పీల్చలేక చస్తాం
నీ నాశనం కోరి చేస్తాం శుభ్రం
అయినా వినిపిస్తుంది నీ శబ్దం
చిట్టి దోమ,కుట్టే దోమ,గీ…పెట్టే దోమ
నీకోసం తయారైంది
మస్కిటో బాట్ అనే దండం
అది నీ పాలిట యమ గండం
నీవు మసై పోయినా
నీ వారసులు సర్వసిద్ధం.

Exit mobile version