డాక్టర్ అన్నా బి.యస్.యస్.-20

0
2

[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]

[ధర్మతేజ డైరీలో రాసుకున్న ఆశయాల గురించి చదువుతాడు అన్నా. వాటితో పాటు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గురించి ప్రస్తావిస్తాడు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితులను రాస్తాడు ధర్మతేజ. బిఎస్ఎస్ లక్ష్యాలను స్పష్టంగా తెలియజేస్తాడు ఆ డైరీలో. చదవడం పూర్తి చేసిన అన్నాకు తండ్రి పట్ల గౌరవం రెట్టింపు అవుతుంది. కొన్ని రాత్రులు.. వారి తల్లి మాధవి బ్రతికి వున్న రోజుల్లో ఆమెతో.. భారతదేశాన్ని గురించి.. పరిపాలనా విధానాలను.. పార్టీల గురించి తండ్రి చర్చించడం అన్నా చూశాడు. వారి కొన్ని మాటలను విన్నాడు. తండ్రి ఆశయం ప్రకారం బిఎస్ఎస్‍ను స్థాపించడానికి సిద్ధమవుతాడు అన్నా. ఆ డైరీని శ్యామ్ చేత కూడా చదివిస్తాడు. వారణాసిలో తల్లిదండ్రుల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేసి, హైదరాబాదు మీదుగా గుంటూరు చేరి, కార్యాచరణకు పూనుకుంటారు. సింధ్యా పిలుపుతో గతంలోంచి బయటపడి వర్తమానంలోకి వస్తాడు అన్నా. శ్యామ్ వచ్చాడని చెప్తాడు సింధ్యా. ఎక్కడ ఉన్నాడని అడిగితే, వరండాలో అని జవాబు చెప్తాడు సింధ్యా. శ్యామ్ తన తమ్ముడి లాంటి వాడని, లోనికి పిలుచుకురమ్మని చెప్తాడు అన్నా. లోపలికి వచ్చిన శ్యామ్ కూర్చుని, అన్నాతో మాట్లాడుతూ తమ ప్రణాళికలను వివరిస్తాడు. డైరీలో ఉన్న ఆఖరి పేజీలలో- రాజమండ్రిలోని ఓ ఆశ్రమం గురించి రాసి ఉన్న వాక్యాలను అన్నాకు చూపి వివరం అడుగుతాడు. వాటి గురించి తనకీ తెలియదని అంటాడు అన్నా. రాజమండ్రి వెళ్ళి ఆ ఆశ్రమంలో వివరాలు కనుక్కోవాలి అని అనుకుంటాదు. ఇంతలో పావని ఫోన్ చేస్తుంది. విమానంలో కలిసి ప్రయాణించిన సంగతి గుర్తు చేస్తుంది. మర్నాడు అన్నాని హాస్పటల్‌లో కలవబోతున్నట్లు చెప్తుంది. ఇక చదవండి.]

[dropcap]“ఓ[/dropcap]కే”

“థాంక్యూ సార్!..”

“నో మెన్షన్ ప్లీజ్!..”

అన్నా సెల్ కట్ చేశాడు.

“ఎవరన్నా..” అడిగాడు శ్యామ్.

“ఒకటిన్నర నెల క్రింద ముంబయి వెళ్లాను కదా.. కాన్ఫరెన్స్‌కి.. నాతో ప్రయాణించిన ఓ అమ్మాయి.. పేరు పావని.. రేవు హాస్పిటల్‌కు నన్ను కలిసే దానికి వస్తుందట..”

“కారణం?..”

“నేను అడగలేదుగా!..” నవ్వాడు అన్నా.

“అడగవలసి వుంది కదా!..”

“అవసరం.. తనది.. మనది కాదుగా! ఆడపిల్లల విషయంలో మనం ఎంత తక్కువ మాట్లాడితే మనకు అంత గౌరవం..”

“ఆ.. ఆ.. అదీ కరక్టే!..”.

“అనుభవం కదూ!..” అందంగా నవ్వాడు అన్నా.

“సరే అన్నా.. ఇంక నేను బయలుదేరుతాను. రేపు ఉదయం పదిగంటలకు మన కట్టడ నిర్మాణం ప్రాంతానికి వెళ్లి చూచి కాంట్రాక్టర్సుతో మాట్లాడిరావాలి. నేను వెళ్లి వస్తాను. నీవు హాస్పిటల్‌కు వెళ్ళు.. సరేనా!..”

“అలాగే!.. మీ మామయ్య కృష్ణయ్యగారిని అడిగానని చెప్పు. మన పనులు ఇంత చురుకుగా సాగుతున్నాయంటే.. అంతా వారి గొప్ప సహకారం.. హాస్పిటల్లో ఒక వార్డ్‌కు వారి పేరును పెట్టాలి..”

“ఓకే.. అన్నా..!” శ్యామ్ కుర్చీనుంచి లేచాడు.

ఇరువురు వరండాలోకి వచ్చారు.

“బై..” చెప్పి శ్యామ్ కార్లో కూర్చొని వెళ్లిపోయాడు.

అన్నా సెల్ మ్రోగింది.

“హలో!..”

“బాబూ.. నేను.. నారాయణమూర్తి..”

“ఆ.. సర్.. విషయం ఏమిటో చెప్పండి సార్!..”

“నిన్న నేను మీ ఫ్రెండ్ శ్యామ్‌ను కలిశాను. ఆయన విషయాన్నంతా చెప్పాడు. ఆరు నెలల్లోపలే మీ తండ్రి మిమ్మల్ని విడిచి వెళ్లిపోయారని చెప్పాడు. నాకు చాలా బాధ కలిగింది. మై ఫ్రండ్ ధర్మతేజ ఈజ్ ఎ గోల్డన్ మ్యాన్.. ఐ మిస్‌డ్ హిమ్.. సో శాడ్.. సో శాడ్..” ఎంతో వివరంగా చెప్పాడు.

“అంతా దైవ నిర్ణయమే కదా సార్!..” దీనంగా చెప్పాడు అన్నా.

“అన్నా.. ప్లీజ్ కంట్రోల్.. ప్లీజ్ కంట్రోల్.. మీకు ఏదైనా సాయం కావాలంటే నన్ను అడగండి. నేను చేస్తాను. ఇపుడు నేను ఫోన్ చేసింది ఎందుకో తెలుసా!..” నవ్వాడు నారాయణ మూర్తి.

“చెప్పండి సార్!!..”

“రేపు పార్వతి పుట్టిన రోజు.. మీరు తప్పక రావాలి..”

“పార్వతి..”

“నా కూతురు.. కలెక్టరు!..”

“ఆహా.. సరే సార్!.. సాయంత్రం ఏడుగంటలకు వస్తాను.. ఓకే.. కదా!..”

“ఓకే.. సంతోషంతో చెప్పాడు నారాయణమూర్తి. సెల్ కట్ చేశాడు.

***

డాక్టర్ అన్నా.. డాక్టర్ శృతి వార్డ్ రౌండ్సు ముగించుకొని రూమ్‌కి వచ్చారు.

యం.డి. పార్వతీశం ఫోన్.

శృతి ఫోన్ చేతికి తీసుకొంది.

“హలో!..”

“ఎవరూ?..”

“శృతిని సార్!..”

“అన్నా లేడా?..”

“వున్నారు సార్!..”

“ఫోన్ అతనికి ఇవ్వు!..”

రెస్ట్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన అన్నాతో..

“సార్!.. ఎం.డి. గారు మీతో మాట్లాడాలంట..” శృతి ఫోన్ అందించింది.

ఫోన్ చేతికి తీసుకొని అన్నా..

“హలో!..” అన్నాడు.

“ఆ.. అన్నా!.. నా రూమ్‌కి రా!..”

“ఓకే.. సార్!..” కృతి వైపుకు తిరిగి.. “రమ్మంటున్నారు.. వెళ్లివస్తాను..”

అన్నా వేగంగా గదినుండి బయటకు నడిచి కొద్ది సేపట్లో యం.డి. పార్వతీశం గదిని సమీపించాడు.

అపుడే బయటకు వచ్చిన డాక్టర్ యామినీ.. “సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు.. వెళ్లండి..” చిరునవ్వుతో చెప్పి వెళ్లిపోయింది.

అన్నా తలుపు లోనికి త్రోశాడు.

“రా.. రా అన్నా!.. రా!..” చిరునవ్వుతో ఆహ్వానించాడు యం.డి పార్వతీశం.

“గుడ్ మార్నింగ్ సార్!..”

యం.డి.కి ఎదురుగా వున్న ఓ కుర్చీలో ఓ యువతి కూర్చొని వుంది. కుర్చీల వెనుక.. యం.డి. గారి టేబుల్ ముందు అన్నా నిలబడ్డాడు. ఆ కారణంగా ఆ యువతి ముఖం అన్నాకు తెలియలేదు.

“కూర్చో.. అన్నా!..” నవ్వుతూ చెప్పాడు పార్వతీశం.

అన్నా కుర్చీలో కూర్చున్నాడు. ప్రక్కకు తిరిగి చూచాడు. ఆ అమ్మాయి ఎవరో అర్థం అయింది.

“గుడ్మార్నింగ్ సార్!..” అంది ఆమె నవ్వుతూ..

“అన్నా!.. ఈమె పేరు పావని. యం.యస్. చికాగోలో పూర్తిచేసి వచ్చింది. నా స్నేహితుని కూతురు. ఈరోజే జాయినింగ్.. నీవు ట్రయిన్ చేయాలి..”.

పావని చిరునవ్వుతో అన్నా ముఖంలోకి చూచింది.

“సార్.. వీరిని నేను ఒక నెలన్నర క్రిందట ప్లయిట్‌లో కలిశాను.” అని ఆయనకి చెప్పి “గుడ్ మార్నింగ్!..” గౌరవప్రదంగా పావనికి విష్ చేశాడు.

పావనిని.. అతని వినయం.. మాటల్లో వుండే సౌమ్యత.. ఎపుడూ చిరునవ్వుతో వుండే ముఖం.. ఎంతగానో ఆకర్షించాయి.

అతనికి తనకు ఏదో జన్మ జన్మల సంబంధం వున్న భావన. అతని పట్ల ప్రేమ.. గౌరవం..

“సార్!.. మీరు చెప్పినట్లే చేస్తాను..” అన్నాడు ఎంతో వినయంగా,

యం.డి. పార్వతీశం కుర్చీనుండి లేచాడు.

“మిస్ పావనీ!.. ఫ్రీ నౌ.. హియీజ్ డాక్టర్ అన్నా.. యీజ్ యువర్ బాస్.. నిర్భయంగా నీ సందేహాలు అడగవచ్చు.. తీర్చుకోవచ్చు.. ఓకే.. కదా అన్నా!..” నవ్వుతూ అడిగాడు పార్వతీశం.

అవునన్నట్టు చిరునవ్వుతో తల ఆడించాడు.

“ఆల్‌రైట్.. పావనీ.. టేక్ కేర్..” పార్వతీశం వెళ్లిపోయాడు.

అన్నా ముందు.. వెనుక పావని.. అన్నా గదివైపుకు నడవసాగారు.

అన్నా సెల్ మ్రోగింది..

“హలో!..”

“హలో!..”

“హు యీజ్ స్పీకింగ్!..”

“కలెక్టర్ పార్వతి!..” కావాలనే అలా చెప్పింది పార్వతి. కారణం.. అన్నా.. తమ కుటుంబం అతన్ని ఫ్లయిట్‌లో కలసినపుడు అతను చాలా బెట్టుగా.. గర్వంగా ప్రవర్తించాడని పార్వతి భావన.

“ఓకే.. మేడమ్.. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?..”

“ఐ డోన్ట్ వాంట్ ఎనీ థింగ్..”

“దెన్.. వాట్ ఫర్ దిస్ కాల్!..”

“మా నాన్నగారు ఫోన్ చేయమని చెప్పారు..”

“విషయం ఏమిటి?..”

“ఈ రోజు సాయంత్రం మీరు మా యింటికి..”

“ఓ.. ఓ.. యువర్ బర్త్‌డే .. మెనీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే.. తప్పకుండా సెవన్ ధర్టీకి వస్తాను. నాన్నగారికి చెప్పండి.. ఓకేనా?..”

“థాంక్యూ సర్!” గలగలా నవ్వుతూ సెల్ కట్ చేసింది పార్వతి..

పావని అన్నా ముఖంలోకి చూచి వ్యంగ్యంగా నవ్వింది.

ఆ నవ్వులోని అర్ధాన్ని గ్రహించి అన్నా..

“ఏం.. అదోలా నవ్వుతున్నారు?..”

“ఆహా.. ఏం లేదు సార్!..”

“హు.. నాకు తెలుసు.. మీ మనస్సులో ఇప్పుడు ఏమనుకొంటున్నారో చెప్పమంటారా!..”

పావని ఆశ్చర్యంతో అన్నా ముఖంలోకి చూచింది.

“ఫోన్ చేసింది.. మా నాన్నగారి ప్రియ మిత్రుని కుమార్తె.. ఆమెను వారి కుటుంబాన్ని మీరూ ఆరోజు ఫ్లయిట్‍లో చూచారు. అదే మనం కలసిన రోజున.. ఆలోచించండి.. ఆ వ్యక్తి మీకు గుర్తుకు వస్తుంది.. మీరూ ఆలోచించేది వారిని గురించేగా పావనిగారూ!..”

‘వీరు చాలా తెలివికలవారు.. కళ్లతోనే సర్వాన్ని గ్రహించగల సమర్థులు. వీరి దగ్గర నేను పని నేర్చుకోవాలి. వారి స్వవిషయాల్లో జోక్యం కలిగించుకోకూడదు. డ్యూటీ విషయంలో అడగవలసింది అడగటం.. నేర్చుకొనడం.. అవసరం. నవ్వి పొరబాటు చేశాను.. మరోసారి అలాంటి పొరపాటు చేయకూడదు..’ అనుకొంది పావని.

ఇరువురూ గదిలో ప్రవేశించారు.

కూర్చొనివున్న డాక్టర్ శృతి నవ్వుతూ నిలబడింది.

“శృతీ!..”

“యస్ బాస్!..”

“వీరి పేరు పావని.. ఈ రోజు నుంచీ మన టీమ్‌లో.. మనతో కలసి పనిచేస్తారు. ఆ పావనీ.. షి యీజ్ శృతి.. సీనియర్ టు యూ.. కలసి ఆనందంగా పనిచేయాలి..”

“ఓకే.. సార్!..”

శృతి.. చేతిని సాచింది.. పావని శృతి చేతిని నవ్వుతూ తన చేతిలోకి తీసుకొంది.

“నౌ ఆన్‌వర్డ్స్ వుయార్ ఫ్రెండ్స్..” అంది శృతి.

“యస్!.. యస్!..” అంది పావని.

“శృతి.. సాయంత్రం నాకో ప్రోగ్రాం వుంది. విజయవాడ వెళ్లాలి.. నేను ఇంటికి వెళుతున్నాను. టేక్ కేర్!.. పావనిని వార్డ్‌కి తీసుకెళ్లి చూపించు” చెప్పాడు అన్నా.

“ఓకే.. సార్!..” అంది శృతి

“బై.. వస్తాను..” అన్నా గదినుండి బయటికి నడిచాడు.

ఇంటికి వెళ్లి స్నానం చేసిన డ్రస్ చేసుకొని టైమ్ చూచుకొన్నాడు. ఫయివ్ థర్టీ.. నారాయణమూర్తి గారికి తాను చెప్పింది సెవన్థెర్టీ.. టు ఆవర్ టైముంది.

‘ఓకే.. టైముకు ముందుగానే వెళ్లిపోగలం..’ అనుకొన్నాడు.. అన్నా.

మాధవయ్య లేచి అన్నా వున్న గదికి చంక క్రింద కర్ర సాయంతో వచ్చాడు.. లక్ష్మి మాధవయ్య కూతురు చిన్నీ కూడా వచ్చారు.

“మాధవయ్య గారూ!.. ఏమిటీ విషయం?..” అడిగాడు అన్నా.

“మీ దయవల్ల నాకు ఆరోగ్యం చాలా వరకు కుదుట పడింది.. నేను నా కూతురు మా వూరికి వెళ్లిపోతాము స్వామీ!..”

“ఆ.. నో.. నో!.. మాధవయ్యగారూ.. ఇప్పట్లో మీరు ఎక్కడికి వెళ్లటానికి లేదు.. కారణం.. మిమ్మల్ని చంపాలని ప్రయత్నించిన పాండు.. రుద్ర.. జైల్లో వున్నారు. కోర్టులో విచారణ జరగాలి.. వారికి శిక్ష పడాలి.. అంతవరకు మీరు మీ గ్రామానికి వెళ్లకూడదు. కారణం.. ఇందులో పెద్ద తల భుజంగవర్మగారి హస్తంవుంది కాబట్టి.. నేను బయటికి వెళుతున్నాను.. వెళ్లి భోంచేసి పడుకోండి. సింధ్యా భాయ్!.. నేను ఆలస్యంగా రావచ్చు.. జాగ్రత్త..”

శృతి కాల్..

“హలో.. శృతి!.. ఏమిటి విషయం?..”

“ఒక ముఖ్యమైన విషయం తెలిసింది..”

“ఏమిటది?..”

“పావని..”

“ఆ.. పావని!..”

“భుజంగవర్మ కూతురట..”

అన్నా కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయాడు.

“బాస్!..” అంది శృతి

“యస్ శృతి?..”

“బాస్.. మనం జాగ్రత్తగా వుండాలి!..”.

“ఏ విషయంలో!..”

“పావని విషయంలో!..”

“డోన్ట్ వర్రీ.. డియర్ !.. విథింగ్ వీల్ హ్యాపెన్.. శ్యామ్ ఫోన్ చేశాడా?”

“లేదు బాస్!..”

“ఒకే.. నో ప్రాబ్లమ్ .. నేను మాట్లాడుతాను..” కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు అన్నా..

***

అన్నా.. ఇంటి నుండి బయలుదేరి బజారు వెళ్లి.. పార్వతికి గోల్డు ఫ్రేమ్ మిఖెల్‌కోర్స్ వాచ్‌ని కొన్నాడు. ఏడుగంటలకల్లా విజయవాడలో వారి ఇంటిముందు కారును ఆపి దిగాడు.

అతని రాకకు ఎదురు చూస్తున్న నారాయణమూర్తి,.. మాధవ్.. అతనిని సమీపించి స్వాగతం పలికారు.

వారు ముందు వెనుక అన్నా నారాయణమూర్తిగారి నిలయంలో ప్రవేశించారు.

భార్య ఇంద్రజ.. పార్వతి చిరునవ్వులతో స్వాగతం పలికారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here