Site icon Sanchika

డాక్టర్ అన్నా బి.యస్.యస్. – సరికొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందించబోతున్నాము.

***

ఈ మన హైందవ భారత దేశం… అనాదిగా అంటే కృత.. త్రేతా.. ద్వాపర.. ప్రస్తుతం కలియుగం వరకూ.. హైందవ దేశం. ఆఫ్ఘనిస్థాన్ మీదుగా మొహ్మద్ ఘజనీ ఈ దేశంలో 1193వ సంవత్సరంలో ప్రవేశించాడు. క్రమంగా వారి పరివారం అప్పటి మన హైందవ అమాయక ప్రజల ఆదరాభిమానాలు.. సాటి మనుష్యులుగా భావించి ఆదరించే సద్గుణాల కారణంగా.. ఇస్లామీయులు ఈ దేశ పాలకులైనారు.. వారిలో కొందరు దేశ వినాశకులుగా మారిపోయారు. తర్వాత వ్యాపార నిమిత్తం ఆంగ్లేయులు 1600 సంవత్సరంలో మన దేశంలో ప్రవేశించారు.. మన దేశ మహోన్నత సంపదను చూచిన వారి ధోరణి వ్యాపారం నుంచి రాజ్య స్థాపన వైపుకు మొగ్గింది. ఆనాటి పాలకులను వంచించారు.. మోసగించారు.. చంపివేశారు.. దేశానికి ప్రభువులైనారు. ఆంగ్లో ఇండియన్స్ అనే మరో జాతి పుట్టుకకు కారకులైనారు. వారి మతమైన క్రిస్టియానిటీ లోనికి మన ప్రజలను మార్చారు. నేటికీ మారుస్తున్నారు.

అది.. సరైన మానవతావాదం కాదు. అమెరికాలో ఒక గొప్ప విద్యా సంస్థ ప్రధానాధికారిగా హెూదాలో ఉన్న ఓ భారతీయుడు.. ప్రస్తుత దేశం యావత్ ప్రజానీకం.. ఉన్నతికి.. ఆనందానికి.. పరస్పర మైత్రి.. సోదర భావన.. భాషాభివృద్ధికి.. కుల మత ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా.. ‘అందరూ భారత వాసులుగా’… ఏక భావనలో భారతదేశపు సత్ సంతతిగా ప్రపంచానికి ఆదర్శ ప్రాయంగా వర్ధిల్లాలని ‘భారత్ సేవా సమాజ్’ను ‘బి.యస్.యస్.’ పేర సిద్ధాంతీకరణ చేశారు. స్వదేశానికి రావాలనుకున్న వారి ఆశయం.. నెరవేరలేదు. వారి కుమారుడు స్వదేశానికి వచ్చాడు. తండ్రి కలలను నిజం చేయాలని తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. అతని జీవితంలోని ఆటుపోటుల, చీకటి వెలుగుల మేలి కలయికే.. శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవల.

***

ఈ ధారావాహిక వచ్చే వారం నుంచే… చదవండి.

Exit mobile version