డా. సిహెచ్. సుశీలమ్మకి అభినందనలు

7
57

సంచిక మాగజైన్‌లో రెగ్యులర్‌గా విమర్శావ్యాసాలు రాస్తూ, కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారి జీవిత చరిత్ర సీరియల్‌గా రాసిన డా. సిహెచ్. సుశీలమ్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వులు మేరకు ‘తెలుగు & సంస్కృత అకాడమీ’కి డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించబడిన సందర్భంగా శుభాకాంక్షలు.

డా. సిహెచ్. సుశీలమ్మ రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ ఇన్ తెలుగు.

డా. సిహెచ్. సుశీలమ్మ

  1. కిన్నెరసాని పాటలు – సమగ్ర పరిశీలన
  2. కవిత్వ పరామర్శ – విమర్శనా వ్యాసాలు
  3. ముళ్ళపూడి వెంకటరమణ రచనలు – పరిశోధన
  4. స్త్రీ వాదం – పురుషరచయితలు
  5. కొవ్వలి లక్ష్మీనరసింహారావు జీవితచరిత్ర
  6. విమర్శనాలోకనం – విమర్శ వ్యాసాలు
  7. పేరడీ పెరేడ్ (పేరడీలు)
  8. పడమటి వీథి (కవితా సంపుటి)

వంటి పుస్తకాలు ప్రచురించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లెసన్ రైటర్‌గా, సహ సంపాదకులుగా వున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లో అనేక కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ సెమినార్‌లలో పత్రసమర్పణ చేసారు.

అకాడమీ చైర్ పర్సన్ డా. నందమూరి లక్ష్మీపార్వతి గారు, ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఐ.జి. ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శ్రీ రామకృష్ణ, ఐ.ఆర్.యస్. గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపయోగపడే పుస్తక ప్రచురణలతో పాటు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టనున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటున్న సుశీలమ్మ గారికి మరోసారి అభినందనలు.

సంచిక టీమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here