ద్రౌపది

1
2

[box type=’note’ fontsize=’16’] “మహాభారతములో ద్రౌపది పాత్ర విశిష్టమైనది, మహోన్నతమైనది, మరుపురానిది” అంటూ ద్రౌపది గురించి కొన్ని విషయాలను ఈ వ్యాసంలో వెల్లడిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]మ[/dropcap]హాభారతము మొత్తము మీద ద్రౌపది పాత్ర చాలా వరకు ఇతరులచేత సరిగా పూర్తిగా అర్ధము చేసుకొని పాత్ర. అంతేకాకుండా ఐదుగురు మహావీరులను భర్తలుగా పొందినప్పటికీ అనేక కష్టాలు అవమానాల పాలైన స్త్రీ పాత్ర కూడా ద్రౌపదియే. వర ప్రభావము వలన జన్మించి, పరమశివుని వర ప్రభావము వలన ఐదుగురు భర్తలను పొంది కురు సామ్రాజ్య పట్టమహిషిగా అయిన మహిళ ద్రౌపది.  వీటి అన్నింటికన్నా గొప్ప విశేషము శ్రీ కృష్ణుని ఆదరాభిమానాలను పూర్తిగా పొంది తన కష్టకాలంలో శ్రీకృష్ణుని అండదండలను పొందిన వ్యక్తి కూడా ద్రౌపదియే. మహాభారతములో ద్రౌపది పాత్ర విశిష్టమైనది, మహోన్నతమైనది, మరుపురానిది. అటువంటి ద్రౌపది గురించి అనేక మంది భాష్యకారులు పుంకానుపుంఖాలు భాష్యాలు చెప్పారు. అనేక గ్రంథాలు వెలువడ్డాయి. ప్రస్తుతము ద్రౌపది గురించి కొన్ని విశేషాలను (అన్నితెలిసినవే అయినా) ముచ్చటించుకుందాము.

గత జన్మలో ద్రౌపది పేరు నలయాని. తపస్సుకు చేసుకుంటున్న ఒక ముని పుంగవుడి ఆగ్రహానికి గురి అవటం వల్ల ఆ ముని “ఈ జన్మలో నీకు పెళ్లి కాదు” అని శపిస్తాడు. అప్పుడు నలయాని శివుని కోసము ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమైనప్పుడు తనకు ఐదు గుణాలు (ధర్మము, పర్వతాలను పిండి చేయగలిగే బలము, విలువిద్యలో ప్రావీణ్యము, ప్రకృతి ఆరాధకుడు, అందగాడు) కలవాడు భర్త కావాలని అడుగుతుంది. పరమశివుడు ఈ లక్షణాలు అన్ని ఒకరిలో ఉండవు ఇవన్నీ కావాలంటే ఐదుగురు భర్తలు కావలసి ఉంటుంది అని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ నలయాని అదే వరము అడుగుతుంది. ఆ వర ఫలితమే మరు జన్మలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ద్రౌపది అడిగిన లక్షణాలు కలిగిన వారు భర్తలుగా వస్తారు.

పాంచాల దేశపు రాజైన ద్రుపదుడు ద్రోణాచార్యుడు గురుకులంలో సహాధ్యాయులు. కానీ ఆ తరువాత ద్రుపదుడు తన సహాయము ఆశించి వచ్చిన ద్రోణుడిని అవమానిస్తాడు. ఆ తరువాత ద్రోణుడు తన శిష్యుడైన అర్జునుని ద్రుపదుడు పైకి యుద్దానికి పంపి రాజ్యాన్ని హస్తగతము చేసుకుంటాడు. ఈ అవమానాన్ని భరించలేని ద్రుపదుడు యజ్ఞము చేస్తే హోమగుండము నుండి ద్రౌపది, అలాగే సోదరుడు దృష్టద్యుమ్నుడు జన్మిస్తారు. ద్రుపద రాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అనే పేరు. ఐదుగురిని భర్తలుగా పొందింది కాబట్టి పాంచాలి అని, శరీరము రంగు నలుపు కాబట్టి కృష్ణ , యజ్ఞకుండము నుండి పుట్టినది కాబట్టి యాజ్ఞసేని, అలాగే అయోనిజ అని అంటారు. విరాటుని కొలువులో అజ్ఞాతవాసము అప్పుడు రాణి సుధేష్ణ వద్ద శిరోజాలంకరణ నిమిత్తము సైరంధ్రి పేరుతో దాసిగా ఉంటుంది, ఈవిధముగా ద్రౌపది వివిధ పేర్లతో పిలువబడేది.

పుక్కిటి పురాణాలలో చెప్పబడుతునట్లు దుర్యోధనుడు ఇంద్రప్రస్థములోని మయసభలో నీటి కొలనులో పడినప్పుడు ద్రౌపది నవ్వలేదు. పక్కనున్న పరిచారికలు నవ్వటం వలన దుర్యోధనుడు ద్రౌపదియే నవ్వింది అని అపోహ పడి ఈర్ష్య పెంచుకొని కురుక్షేత్ర సంగ్రామానికి కారణమవుతాడు. కానీ ద్రౌపది అటువంటి మనస్తత్వము గల అల్ప స్త్రీ కాదు

ఒకసారి శ్రీకృష్ణుడి చేతి వ్రేలికి గాయము అవుతుంది. ఇది చూసిన  ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి శ్రీ కృష్ణుని వ్రేలికి  కట్టు కట్టి రక్తస్రావాన్ని ఆపుతుంది. శ్రీ కృష్ణుడు అంతటి మహానుభావుని రక్తము నేలపై పడకుండా కాపాడుతుంది. శ్రీ కృష్ణుడు ద్రౌపది చూపిన ఆదరాభిమానాలకు సంతుష్టుడై అవసరమైన సందర్భములో ఆదుకుంటాను అని వరము ఇస్తాడు. అందుచేతనే నిండు కౌరవ సభలో పెద్దలు అందరి ముందు దుశ్శాసనుడు ద్రౌపదికి వస్త్రాపహరణము చేస్తుండగా శ్రీ కృష్ణుడు చీరల ప్రవాహాన్ని అందజేసి దుష్ట కౌరవుల పన్నాగాన్ని వమ్ము చేస్తాడు. ఆ రోజు అనాలోచితముగా శ్రీ కృష్ణునికి చేసిన చిన్న సహాయము ద్రౌపదికి ఎన్నో రెట్లుగా తన మానాన్ని కాపాడుకోవటానికి సహాయపడింది.

ఆ విధముగా శ్రీ కృష్ణుడికి ఇష్టురాలు ద్రౌపది. ఒకసారి పాండవులు అరణ్యవాసములో ఉండగా దుర్యోధనుడు పాండవులను ఇబ్బంది పెట్టటానికి వేళగాని వేళ ముక్కోపి అయినా దూర్వాస మహామునిని శిష్యులతో సహా పాండవుల దగ్గరకు భోజనాలకు పంపుతాడు. ఆ సమయములో భోజనాలు ముగించుకొని అక్షయపాత్రను కడిగి ద్రౌపది ఉంచుతుంది. ఆ సమయములో శ్రీ కృష్ణుడు ప్రత్యక్షమయి అక్షయ పాత్రలో ఉన్న ఒక్క మెతుకు తానూ తిని దుర్వాసుడు అతని శిష్యుల ఆకలిని తీరుస్తాడు. ఆ విధముగా కౌరవుల పన్నాగాన్ని తిప్పి కొడతాడు. ఆ విధముగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి అన్ని సందర్భాలలో రక్షగా ఉండి సహాయపడతాడు.

ద్రౌపదికి ధర్మరాజు ద్వారా ప్రతివింధ్య, భీముని ద్వారా సుతసోమా, అర్జునుని  ద్వారా శృతకర్మ, నకులిని ద్వారా శాతానిక, సహదేవుని ద్వారా శ్రుతసేన అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరినే ఉపపాండవులు అంటారు.  ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉన్నప్పటికీ పురాణాల్లో చెప్పబడే ఐదుగురు కన్యలలో ఒకతి. ద్రౌపది ఘటోత్కచుడుని శపిస్తుంది. ఎందుకంటే ఘటోత్కచుడు మొదటిసారి తండ్రి భీముడిని చూడటానికి వచ్చినప్పుడు ద్రౌపదిని గౌరవించడు. ఆ విధముగా అవమానము చెందిన ద్రౌపది ఘటోత్కచుడు అల్పాయుష్కుడిగా అవుతాడని యుద్ధము చేయకుండానే చంపబడతాడని శపిస్తుంది. అప్పుడు ఘటోత్కచుని తల్లి హిడింబా కూడా ద్రౌపదిని – నీ కుమారులందరూ అంటే ఉపపాండవులు నిద్రించే సమయములో మరణిస్తారు అని శపిస్తుంది. ఆ శాప ఫలితమే అశ్వత్థామ చేతిలో ఉపపాండవులు నిద్రిస్తున్నవేళ చనిపోతారు.

అర్జునుడు అశ్వత్థామను బంది  చేసి ద్రౌపది కాళ్ళ మీద పడవేసి ఏ రకముగా శిక్షించమంటావు అని ద్రౌపదిని అడిగితే ద్రౌపది చాలా పెద్ద మనస్సుతో అశ్వథామను క్షమిస్తుంది. ఈ సంఘటన ద్రౌపది ఔన్నత్యానికి నిదర్శనము. గురుపత్ని అంటే ద్రోణుడి భార్యకు పుత్రశోకము కలుగజేయకూడని ద్రౌపది భావించి అశ్వత్థామను క్షమించి వదిలివేస్తుంది. అలాగే తనను ఎత్తుకుపోవాలని ప్రయత్నించిన జయద్రదుడిని పాండవులు తెచ్చి ద్రౌపది కాళ్ళ మీద పడవేసినప్పుడు జయధ్రదుడు ఆడబడుచు దుస్సల భర్త కాబట్టి క్షమించి వదలి వేయమని చెపుతుంది. అప్పుడు భీముడు తలగొరిగి అవమానించి పంపుతాడు. ఆ అవమాన ఫలితమే జయధ్రదుడు తపస్సు చేసి అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను ఒక రోజు నిలువరించే వరము పొంది అభిమాన్యుని చావుకు కారణమవుతాడు.

పాండవులు అరణ్యవాసము చేస్తున్నప్పుడు ద్రౌపది చెట్టు నుండి వ్రేలాడుతున్న పండును కొస్తుంది. ఆ పండును కోసిన వెంటనే శ్రీ కృష్ణుడు ప్రత్యక్షమై ద్రౌపదిని ఆ పండు తినకుండా వారిస్తాడు ఎందుకంటే ఆ పండును ఒక ముని తపస్సు అనంతరము తినాలని ఉంచినది. ఆ పండు కనిపించకపోతే ఆ ముని ఆగ్రహానికి గురికావలసి వస్తుంది కాబట్టి ఆ పండును యథాస్థానములో చెట్టుకు తగిలించాలి. అప్పుడు ద్రౌపది శ్రీ కృష్ణుని ఈ సమస్యకు పరిష్కారము చూపమని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ పండును యథాస్థానంలో ఉంచాలి అంటే ఏ విధమైన రహస్యాన్ని దాచుకోకుండా చెప్పాలి. అప్పుడు ద్రౌపది పాండవుల శత్రువు అయిన కర్ణుని అభిమానిస్తున్నట్లు నిజాన్ని ఒప్పుకుంటుంది. ఇది పాండవులకు పెద్ద షాక్ లాంటిది. అప్పుడు పండు మళ్ళా చెట్టుకు అతుక్కుంటుంది. ఈ కథనం కల్పితము అని చాలా మంది పండితుల అభిప్రాయము. ఎందుకంటే ఇది వ్యాస భారతములో లేనిది కాబట్టి దీనిని నమ్మవలసిన పని లేదు.

చివరగా పాండవులు శ్రీకృష్ణుని నిర్యాణము తరువాత అందరూ స్వర్గారోహణ మొదలు పెట్టినప్పుడు మొదటగా ద్రౌపది పడిపోతుంది. భీముడు ధర్మరాజును ద్రౌపది పడిపోవటానికి కారణము అడిగితే ద్రౌపది ఐదుగురు భర్తలలో అర్జునుడు అంటే ఎక్కువ అభిమానము ప్రేమ కలిగి ఉండటమే అని చెపుతాడు. ఐదుగురిని సమానముగా ప్రేమించకపోవటం వల్ల ఇది జరిగింది అని ధర్మరాజు ధర్మ సూక్ష్మము చెపుతాడు. ఆ విధముగా మహాభారతములో ద్రౌపది కథ ముగుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here