Site icon Sanchika

డా॥ శాంతి నారాయణ రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభకి ఆహ్వానం

[dropcap]తె[/dropcap]లంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో డా॥ శాంతి నారాయణ రచించిన ‘నాలుగు అస్తిత్వాలు-నాలుగు నవలికలు’, ‘నాగలకట్ట సుద్దులు-2’ పుస్తకాల ఆవిష్కరణ సభ శుక్రవారం, 05 జూలై 2019 సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మినీహాలులో జరుగుతుంది.

సభకు సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత కె. శివారెడ్డి అధ్యక్షత వహిస్తారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి పుస్తకాలను ఆవిష్కరిస్తారు.

ముఖ్య అతిథిగా నందమూరి లక్ష్మీ పార్వతి, విశిష్ట అతిథిగా మామిడి హరికృష్ణ పాల్గొంటారు.

డా॥మేడిపల్లి రవికుమార్, డా॥ఏ.కె. ప్రభాకర్, గుడిపాటి ఆత్మీయ అతిథులుగా హాజరవుతారు.

సాహితీ ప్రియులందరూ ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు.

***

‘నాగలకట్ట సుద్దులు – 2’ పుస్తకానికి ఎ. కె. ప్రభాకర్ గారు వ్రాసిన ముందుమాట ఇక్కడ చదవచ్చు.

‘నాలుగు అస్తిత్వాలు – నాలుగు నవలికలు’ పుస్తకానికి గుడిపాటి గారు వ్రాసిన ముందుమాట ఇక్కడ చదవచ్చు.

Exit mobile version