Site icon Sanchika

దుఃఖ ప్రవాహం

[dropcap]నీ[/dropcap]కు
నా వంచిన తల మాత్రమే కనిపిస్తోంది
నువ్వు
మూసిన నా కనురెప్పల్ని మాత్రమే చూస్తున్నావ్

దుఃఖం నా గుండెల్ని ఎంతగా ముంచెత్తిందో
రోదించీ రోదించీ అలిసిన నా కనుపాపల్ని అడుగు

తడిసి ముద్దయి చీలికలు పీలికలయిన
చేతి రుమాల్ని తడుము

ఇంకా ఓపికుంటే
నే నడిచిన పాదాల కింది
మట్టిని దోసిట్లోకి తీసుకుని
నీ గుండెలకానించుకో

నా గుండెల్లోని దుఃఖం
నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది

నాలోని వేదన నీలోకి ప్రవహిస్తుంది

Exit mobile version