[box type=’note’ fontsize=’16’] కావలి లోని రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న ఎం. సాకేత్ వ్రాసిన కథ “దురాశ దుఃఖానికి చేటు“. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]
[dropcap]న[/dropcap]రసాపురం అనే ఊరిలో రాము అనే పిల్లాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు చాలా అల్లరి చేసేవాడు. వాళ్ళ అమ్మా నాన్నా ఎంత చెప్పినా వినేవాడు కాదు.
ఒక రోజు అల్లరిగా తిరుగుతున్నపుడు, అతనికి ఒక ఉంగరం దొరికింది. ఆ ఉంగరం ఎవరు ఏమి కోరుకున్నా వారి కోరికలను తీరుస్తుంది. రాము ఆ ఉంగరంతో అందిరిని ఏడిపించేవాడు. అందువలన ఆతనితో ఎవరూ స్నేహంగా ఉండేవారు కాదు.
ఒక రోజు రాము ఆ ఉంగరంతో ‘నేను ఏది ముట్టుకున్నా అది బంగారం అయిపోవాల’ని కోరుకున్నాడు. అయితే తను అన్నం తింటున్నప్పుడు, ఆ అన్నం బంగారంగా మారిపోయింది. తను దాన్ని తినలేకపోయాడు. అన్నమే కాదు తను ఏది తినలేనని అనుకున్నాడు. ఏం త్రాగాలన్నా అవి బంగారంగా మారిపోయేవి. అతను చాలా బాధపడ్డాడు. ఏమి తినలేక త్రాగలేక అతను చాలా అనారోగ్యానికి గురి అయినాడు.
తన తప్పును తాను తెలుసుకొన్నాడు. ఆ ఉంగరంతో మంచి పనులు చేయాలని అనుకున్నాడు. అప్పుడు ఆ ఉంగరాన్ని తనను మంచివాడిగా, అందరికి ఉపయోగపడేలా మార్చమన్నాడు.
అప్పటి నుంచి తను ఉంగరంతో అందరికి మంచి చేయటం మొదలు పెట్టాడు. అందరికి మంచి చేసి మంచివాడు అయినాడు.