[dropcap]దు[/dropcap]ర్గుణాల విష పరిష్వంగంలో
చిక్కిన మనిషి తిరోగామేగా!
దురాశ నిశాలో ధన వాంఛితుడు
ఎటులైనా కరువే నిద్ర మనిషికి
చివరకు మిగిలేది దుఃఖమే కదా మనిషికి
మొహం వలలో ఆనందం దూరమవు దుర్గుణం
అది రేపును ఆశల దాహం
మనిషి వెర్రివాడవు వరకూ,
ఆఖరికి మరణ మృదంగం మోగేదాకా
ఆగ్రహం మరో దుర్గుణం
మనిషిని కాల్చి జీవితాన్ని కూల్చేను
అసహనం కోపానికి దారి, శాశ్వత శత్రువులకు నాంది
అహం ప్రమాదకర దుర్గుణం విచ్చు కత్తిలా
మనిషి మనో వికాసాన్ని జడత్వంలో నెట్టు
వదనానికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వ డంభాలతో వాగేను
నిర్మల నిజాయితీ పెద్దలనే అవమానించు
అసూయ మృత్యు కుహరం దారుణ దుర్గుణం
ఇతరులను గాయపరిచే నిప్పుల కొలిమి
మనిషి ఆరోగ్యాన్నీ నాశనం చేసి
తన సహృదయతను విష తుల్యం చేయు క్రమంగా
వివిధ దుర్గుణాలను గ్రహించి
మనిషి వాటిని దూరం పెట్టినప్పుడు
తన వ్యక్తిత్వం వికసించు
ఎప్పటికీ ఆకుపచ్చగా బతుకు
తెగులు పట్టని ఓ చెట్టు వోలే…
~
అనుసృజన: డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆంగ్ల మూలం : పరుశురాం రావు