ద్వైతం

0
2

[dropcap]జీ[/dropcap]వితం ఓ రోజు
పగలు
రాత్రి
రెండూ ఉంటాయి

జీవితం ఓ మాసం
పౌర్ణమి
అమావాస్య
రెండూ ఉంటాయి

జీవితం ఓ వత్సరం
వసంతం
శిశిరం
రెండూ ఉంటాయి

జీవితం ఓ ప్రకృతి
పచ్చదనం
మోడుతనం
రెండూ ఉంటాయి

జీవితం నదీప్రవాహం
అనుకూలం
ఆటంకం
రెండూ ఉంటాయి

కాలప్రయాణం
ప్రకృతిచైతన్యం
నదీప్రవాహం
ఆగటం ఉంటుందా?

నిత్యప్రయాణం
దైవ చైతన్యంతో
సజీవ ప్రవాహంలా
జీవితం ఆగటం ఉండదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here