[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.
***
“MNC (కంపెనీ)లో జాబ్ కొట్టేశాడట రాజు” కాలనీలో అందరి నోటా అదే మాటే. అయిదారు ఇండ్లు వున్న ఆ కాంపౌండ్లో అందరూ రాజూ గురించే మాట్లాడుకుంటున్నారు. అది ఒక చిన్న ఊరు. జిల్లా ప్రధాన కేంద్రం అనుకోవచ్చు. ఓ ఇంజినీరింగ్ కాలేజి, ఓ నాలుగయిదు డిగ్రీ కాలేజీలు వున్నాయి.
“వాడికసలు ఇంగ్లీష్ రాదే, ఎలా కొట్టేశాడబ్బా MNC కంపెనీలో”
“పాకేజీ ఎంతో?”
“అమ్మో పది లక్షలే?”
’ఎంతయినా రాజు చాలా లక్కీ”
“రాజు రేపు ఉదయం హైదరాబాద్ నుంచి వస్తున్నాడట”
“మరి వాడి ఫ్రెండ్ ప్రసాద్ పరిస్థితి ఏంటి?”
“వాడు ఇక్కడే ఉండి పోకుండా వాడు కూడా హైదరాబాద్ వెళ్ళి ఉంటే బాగుండేది”
ఇలా రక రకాలుగా ఎవరికి తొచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
ఆ కాంపౌండ్‌లో ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఓ పదిళ్ళుంటాయి ఆ కాంపౌండ్లో, అందరూ మధ్య తరగతి జీవులే. ఆ రోజంతా ఇదే చర్చ. మరుసటి రోజు వరకు అందరి చర్చలూ వింటూ గడిపేశాడు ప్రసాద్.
రాజు, ప్రసాద్‍లు క్లాస్‍మేట్స్ చిన్నప్పటి నుంచి. మౌనంగా కూర్చుని వున్నాడు ప్రసాద్. రాజు, ప్రసాదు ఇద్దరు ఇంజినీరింగ్ దాకా కలిసే చదివారు బాల్యం నుంచి. ప్రసాదు కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. దూరంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆకాశమంతా కాషాయ వర్ణం అలుముకుంది.
ఇంజినీరింగ్ వరకు ఇద్దరికీ మంచి మార్కులే వచ్చాయి. కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే ఇద్దరికీ చచ్చేంత భయం. ధైర్యంగా కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే బెరుకు. ఇక స్టేజీ ఎక్కి మాట్లాడటం అన్నది కలలో మాట. అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చాక వాళ్ళు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంటర్వ్యూలకు వెళ్ళటం వృథా. వెళ్ళినా ఆ ఇంటర్వ్యూలో ప్రధాన అవరోధం ఇంగ్లీష్‌లో మాట్లాడలేక పోవడం.
ప్రతి ఇంటర్వ్యులో అనేక దశలు ఉంటాయి. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్, ఒకే నిమిషంలో మన భావాల్ని గడ గడా చెప్పేయాల్సిన జస్ట్ ఎ మినిట్ సెషన్స్ (JAM session), టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ, హెచ్చార్ రౌండ్, సెమినార్ ప్రెజెంటేషన్, సైకోమెట్రిక్ టెస్ట్ ఇలా వివిధ దశలు ఉండేవి ఆ ఇంటర్వ్యూలలో. వీళ్ళకు ఇవన్నీ గండాలుగా తోచేవి.
ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కో దశలో వెనుతిరగాల్సి వచ్చేది. కొన్ని సార్లు ఒకటి, రెండు రౌండ్లు విజయవంతంగా ముగించుకుని ముందుకు వెళ్ళినా ఏదో ఒక దశలో వెనుతిరగాల్సి వచ్చేది.
ముఖ్యంగా గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొని విజేతగా నిలబడగలగడం, ఒకే నిమిషంలో మన భావాల్ని గడ గడా చెప్పేయాల్సిన జస్ట్ ఎ మినిట్ సెషన్స్ (JAM session), సెమినార్ ప్రెజెంటేషన్, హెచ్చార్ రౌండ్ ఇంటర్వ్యూలో వారు ఇంగ్లీష్‌లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వారిని మెప్పించటం అసాధ్యం అని ఇద్దరికీ అర్థం అయిపోయింది.
వీరికి ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే తమతో బాటు చాలా మందే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తాము ఇంగ్లీష్‌లో ఎందుకు హాయిగా మాట్లాడలేకపోతున్నారో ఇద్దరికీ అర్థం అయ్యేది కాది. తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల తాము ఇంగ్లీష్‌లో మాట్లాడలేకపోతున్నాము అని అనుకొనే వారు మొదట్లో, అదే నిజమైతే, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న చాలామంది కుర్రాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవటం గమనించారు ఇద్దరు.
ఇంటర్వ్యూకి వెళ్ళటం, ఇంగ్లీష్‌లో మాట్లాడి గ్రూప్ డిస్కషన్స్‌లో నెగ్గటం అసాధ్యం అని ఇద్దరూ తీర్మానించుకుని కూర్చున్నారు.
సరిగ్గా ఈ కారణాల వల్ల సహజంగానే కాలేజిలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూలలో అన్యమనస్కంగా పాల్గొన్నారు. ఏమి ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. ఏదో అటెండ్ అయ్యామా అంటే అయ్యాం అని అటెండ్ అయ్యారు. ఇద్దరూ సెలక్ట్ అవ్వలేక పోయారు.
అంతే కాకుండా ఆయా కంపెనీ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు – ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండని సలహా ఇచ్చి వెళ్ళే వారు.
వారి సలహని పాటించి ఒకట్రెండు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లకివెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేశారు ఇద్దరూ. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఎంతసేపున్నా గ్రామర్ చెప్పటం, టెన్సులు బట్టీ పట్టించటం మినహా కొత్తగా వారికి ఇంగ్లీష్ మాట్లాడించటంలో ఎటువంటి సహాయం లభించలేదు.
ఇద్దరూ కూడా ఒక విధమైన నిరాశకి లోనయ్యారు. ఇక తమ జీవితం ఇంతేనేమో అనే భావన కలిగింది ఇద్దరికీ. హఠాత్తుగ జరిగిన ఒక సంఘటన రాజు జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకు వచ్చింది.
అదేంటంటే, రాజు వాళ్ళ బాబాయి ఒకాయన వచ్చి రాజూని హైదరాబాద్‌కి తీసుకు వెళ్ళాడు. ఆయన రాజుని ఏదో సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌లో చేర్చాడని తెలిసింది. ఆ తర్వాత మరేమీ కబురు తెలియలేదు.
అదిగో ఆ తర్వాత ఇప్పుడే రాజు గురించి వినటం. మరి ఈ గ్యాప్‌లో రాజు జీవితంలో ఏ ఏ మార్పులు జరిగాయో వాడినే అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు ప్రసాద్.
***
“కంగ్రాచ్యులేషన్స్ రాజూ” మనస్ఫూర్తిగా అభినందించాడు ప్రసాద్.
“థాంక్స్ రా ప్రసాద్”
ఇద్దరూ పార్క్‌లో కూర్చుని వున్నారు.
“హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్ లో నా జీవితంలొ ఓ అద్భుతమే జరిగిందని చెప్పచ్చురా” తను చెప్పబోయే విషయానికి అది ఒక ఉపోద్ఘాతంలా చిన్నగా మొదలెట్టాడు రాజు. శ్రద్ధగా వింటున్నాడు ప్రసాద్.
“హైదరాబాద్ వెళ్ళిన రెండవ రోజే మా బాబాయి నన్ను దిల్‌షుక్‌నగర్ లోని రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్‌కి తీసుకెళ్ళారు. నేనెలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను, కేవలం మా బాబాయి పై గౌరవంతో వెళ్ళాను అంతే.
అక్కడికీ వెళ్ళే వరకు నా అభిప్రాయం ఏంటంటే, మిగతా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లలాగా అదీ ఒక ఇన్స్టిట్యూట్ అంతే. మనమిదివరకే ఓ రెండు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లలో చేరి మోసపోయిన అనుభవం వుండటం వల్ల, నేను ఎటువంటి అంచనాలూ పెట్టుకోకుండా జాయిన్ అయ్యాను.
నా అంచనాలన్నింటినీ తలక్రిందులు చేస్తూ, అక్కడి ఫ్రంట్ ఆఫీస్ వారు నాకు ఒక దిగ్భ్రాంతికరమైన విషయం చెప్పారు. ఫీజు మొదలే కట్టాల్సిన అవసరం లేదు, ఒక వారం రోజులు పూర్తి క్లాసులు అటెండయిన తర్వాత నాకు అక్కడి టీచింగ్ నచ్చితేనే ఫీజు కట్టి క్లాసులో కొనసాగవచ్చని చెప్పారు.
వారి మాటలలో ఎక్కడే గానీ ఆర్టిఫిషియాలిటీ గానీ, కపటత్వం గానీ లేవు. నిండు హృదయంతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో వారు చెప్పిన మాటలు విని నాకయితే నోట మాటపెగల్లేదు.
స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్ పట్ల నాకున్న అపోహలని పటాపంచలు చేస్తూ సాగిపోయాయి అక్కడి క్లాసులు. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసింది రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్. నా జీవితంలో ఒక అధ్బుతమే ఆవిష్కారం అయింది అని చెప్పవచ్చు.
నిజం చెప్పాలంటే నా ఒక్కడి జీవితంలోనే కాదు. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి అనుభూతీ అదే. కానీ అక్కడ అడ్మిషన్ దొరకటం అంటే అదృష్టమే అని చెప్పుకోవచ్చు. ఆ వారం రోజుల ఉచిత క్లాసుల సమయంలో , ఫాకల్టీ మమ్మల్ని అనేక రకాలుగా పరీక్షిస్తారు.
మనకు ఇంగ్లీష్ వచ్చా రాదా, మనం ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అన్న అంశాలు కాదు వారు చూసేది. మనకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం రాదు కాబట్టే అక్కడికి వెళ్ళాము అని మనల్ని సానుభూతితో ఆదరిస్తారు. అది కాదు విషయం.
మరి మన అడ్మిషన్ ఎలా ఖరారు చేస్తారు అంటే మనకు అసలు ఇంగ్లీష్‍లో మాట్లాడాలనే ఆసక్తి ఉందా లేదా అన్న అంశం గమనిస్తారు. ఏదో అమ్మానాన్నల బలవంతం మీద చేరుతున్నామా, లేదా మనకు నిజంగా కెరియర్‌పై ఆసక్తి ఉందా అన్న అంశం ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటారు.
యాటిట్యూడ్ పరంగా, లెర్నింగ్‌లో మన ఆసక్తి పరంగా, బిహేవియర్ పరంగా మనల్ని అనేక రకాలుగా పరీక్షించిన పిమ్మటే మనకు అక్కడ అడ్మిషన్ ఖరారు అవుతుంది.
నా కళ్ళ ముందరే కొంతమంది అడ్మిషన్ రిజెక్ట్ చేశారు. నాకు ఇది ఇంకో షాకు.
ఏదో రకంగా అడ్మిషన్ అయితే చాలు అని రాజీ పడిపోయి ఎవరికి పడితే వారికి అడ్మిషన్ ఇవ్వరక్కడ. నిజమైన ఆసక్తి వున్న క్యాండిడేట్లకు మాత్రమే ప్రవేశం.”
“చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను అని నువ్వనుకోనంటే ఒకటి చెబుతాను, ఈ సాఫ్ట్ స్కిల్స్ కాంపస్‌లో చేరటానికి ముందు, చేరిన తర్వాత అని, నా జీవితాన్ని రెండుగా విభజించవచ్చు రా ప్రసాద్. నాకు ఒక్కోసారి కళ్ళెంబడి నీళ్ళొచ్చేవి. వాళ్ళు నా జీవితంలో తెచ్చిన మార్పులతో పోల్చుకుంటే వారు నా దగ్గర వసూలు చేసింది చాలా తక్కువ. వారికి ఎంత ఇచ్చినా ఋణం తీర్చుకోలేను.”
“అసలు నా జీవితంలోకి రాయల్ సాఫ్ట్ స్కిల్స్ క్యాంపస్ ప్రవేశించకుంటే నేనూ అనేక మంది B.Tech గ్రాడ్యుయేట్ల లాగా నిరాశ నిస్పృహలకి గురయ్యి నిరుద్యోగిగా ఉండిపోయేవాడిని” ఉద్వేగంగా చెప్పుకు పోతున్నాడు రాజు.
నిజమే. రాజూని ఉదయం నుంచి గమనిస్తూనే వున్నాడు ప్రసాద్.
ఇంగ్లీష్‌లో అనర్ఘళంగా మాట్లాడటం ఒక్కటే కాదు, వాడి మాట తీరులో, నడిచే తీరులో, పెద్దలను మన్నిస్తూ మాట్లాడే విధానంలో, సెల్‌ఫోన్లో మాట్లాడే విధానంలోనూ, హుందాగా కనిపించేలా బట్టలు ధరించటంలోనూ వాడిలో కొట్ట వచ్చినట్టు మంచి మార్పులు కనిపిస్తున్నాయి.
కాలి గోళ్ళ దగ్గర్నుంచి, ట్రిమ్‍గా తలకట్టు మెయిన్‌టెయిన్ చేయటం వరకూ, చక్కగా షేవింగ్ చేసుకోవటం, ఇలా ప్రతి అంశంలో, అరె వీడు మన రాజేనా అని అనిపించేలా వున్నాడు.
ఆత్మవిశ్వాసం ప్రతిఫలించేలాగా, ఆప్యాయత వ్యక్తపరుస్తూ నవ్వే చిరునవ్వయితేనేమి, తలెత్తి నిటారుగా నిలబడి ఆత్మస్థైర్యంతో ఎదుటి వాడి కళ్ళలో కళ్ళు కలిపి మాట్లాడగలగటంలోనయితేనేమీ, బిగి సడలకుండా, ధృడంగా షేక్‌హ్యాండ్ ఇవ్వటంలో నయితేనేమీ – రాజూ ఒక చక్కటి హై సొసైటీ జెంటిల్‌మేన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు.
“మరి నా పరిస్థితేమిటి ఇలా వుండి పోయింది? నేనెప్పటికి బాగు పడతాను?” మనసులోనే దిగులుగా అనుకున్నాడు ప్రసాద్.
ప్రసాద్ మనసులోని మాటని చదివాడేమోనన్నట్టుగా, రాజూ ఇలా చెప్పటం ప్రారంభించాడు.
“నీకు ట్రెయినింగ్ నేను ఇస్తాను ప్రసాద్” అని తన మిత్రుడి కళ్లలోకి ఆప్యాయంగా చూస్తూ
“అవున్రా ప్రసాదు. నాకు అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ వచ్చేశాయి. ఇంకా రెండు నెలలు టైమ్ వుంది. జాయిన్ అవ్వటానికి. నీకభ్యంతరం లేకుంటే నీకు నేను స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గ్రూమింగ్ ఇవన్నీ నేర్పిస్తాను. సరేనా?”
“అభ్యంతరమా? భలే వాడివే, అంతకన్నా ఇంకేం కావాలిరా. అలాగే కాని”
***
మరుసటి రోజు నుంచే ప్రారంభమయ్యాయి క్లాసులు.