ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 15

0
1

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

ఇవ్వాళ మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము.

మనం ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు మనకు తెలియకుడానే కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. అలవాటులో పొరపాటు అన్నట్టు ఉంటాయి ఇవి.

ఇవి ఎంతగా మన జీవితంలో పెనవేసుకుపోయాయి అంటే, బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్న వారు కూడా ఈ కామన్ ఎర్రర్స్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు ఇవి కరెక్టు కాదు, ఇవన్నీ ఎర్రర్స్ అని నేను చెప్పినా కూడా మీరు అంగీకరించరు మొదట.

“మా చిన్నప్పటి నుండి వింటున్నాము. ఇవి కరెక్ట్ మీరు చెబుతున్నదే తప్పు” అని మీరు ఎదురు వాదించినా ఆశ్చర్యం లేదు.

ఒకటొకటిగా వీటిని తెలుసుకుందాము.

The meeting is preponed:

చాలా మంది పోస్ట్పోన్ (Postpone) అనే పదానికి వ్యతిరేక పదం Prepone  అని అనుకుంటూ ఉంటారు.

అసలు ఈ Prepone అనే  పదం ఇంగ్లీష్ భాషలో లేదు. మరి ఎలా వాడుకలోకి వచ్చుంటుందంటే, ఇంగ్లీష్ భాషలో ప్రీ మరియు పొస్ట్ అనే రెండు విశేషణాలు ఉన్నాయి.

లంచ్‌కి ముందు లంచ్‌కి తర్వాత అనే అర్థంలో ప్రీ లంచ్ సెషన్ – పోస్ట్ లంచ్ సెషన్ అనే పదాలు వాడతారు.

ఎలక్షన్స్‌కి ముందు, ఎలక్షన్స్‌కి తర్వాత అనే అర్థంలో ప్రీ ఎలక్షన్స్ – పోస్ట్ ఎలక్షన్స్ అనే పదాలు వాడతారు.

అదే అలవాటులో మనవాళ్ళు ప్రీ పోన్ అనే పదాన్ని పోస్ట్ పోన్ అనే పదానికి వ్యతిరేక పదంగా ఖాయం చేసుకున్నారు.

కాకపోతే ఇక్కడ చిక్కేమిటంటే, పోన్‌కి ముందు, పోన్‌కి తరువాత అని అనుకోవటానికి పోన్ అనే పదమే లేదు. పోస్ట్‌పోన్ అనేది అదే ఒక పదం. అంతే తప్పనిచ్చి పోన్ తర్వాత అనే అర్థంలో వాడబడలేదు ఇక్కడ.

పోస్ట్‌పోన్‌కి వ్యతిరేక పదం ఏమిటి ఇంతకు అని అడుగుతున్నారా, సరే చెప్పేస్తాను వినండి.

పోస్ట్‌పోన్‌కి వ్యతిరేక పదం = అడ్వాన్స్డ్ (Advanced)

ఇప్పుడు ఏదయినా కార్యక్రమం అనుకున్న తేదీ కన్నా ముందు తేదీకి నిర్వహించేటట్టుగా మార్పు చేస్తే Advanced అని వ్రాయాలి.

ఉదాహరణకి:

The meeting is advanced to 2nd, initially it was planned to be conducted on 5th

The examination is advanced to 1st, initially they thought of conducting it on 3rd.

సరే మీకు ఎలాగూ పోస్ట్‌పోన్డ్ అంటే తెలుసు కద. అయినా ఒకట్రెండు ఉదాహరణలు ఇస్తాను చూడండి.

The meeting is postponed to 7th, it was planned to be conducted on 5th

The examination is postponed to 5th, initially they thought of conducting in on 3rd.

ఇలా  సరి అయిన విధంగా పోస్ట్‌పోన్ మరియు అడ్వాన్స్డ్ అనే పదాలు వాడాలి. కాబట్టి ఎవరైనా ప్రీపోన్డ్ తప్పుగా ఉపయోగిస్తుంటే, అడ్వాన్స్డ్ అని ఉపయోగించాలి. కరెక్ట్ పదం Advanced. సరేనా.

I come by walk

ఇది ఇంకొక కామన్ ఎర్రర్.

’నడిచి వచ్చాను’ అని చెప్పటానికి చాలా మంది ‘ఐ కమ్ బై వాక్’ అని అనేస్తుంటారు. ఇలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇంగ్లీష్ భాషలో లేదు.

దీనికి సరి అయిన ఇంగ్లీష్ ఎక్స్‌ప్రెషన్ ఏమిటి అంటే: I come on foot  అని చెప్పాలి.

ఎలాగూ చర్చ వచ్చింది కాబట్టి చెబుతున్నాను, ఐ కం బై కార్ అనో ఇలా ఏదైన వాహనం గురించి చెప్పవచ్చు.

కానీ నడిచి వచ్చాను అనటానికి ‘ఐ కం ఆన్ ఫుట్’ అనటం కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్.

అదే విధంగా రెండు చక్రాల వాహనంలో వచ్చాను అనటానికి ఐ కం ఆన్ బైక్ అనాలి. ఐ కం బై బైక్ అనకూడదు.

కొన్ని ప్రదేశాలలో ఓంటె, గాడిద, గుర్రం మీద కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇలా జంతువుల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా ’ఆన్’ అనే వాడాలి.

ఈ కింద ఇస్తున్న కరెక్టు ఉదాహరణలు చూడండి.

Examples:

I come on foot

I come by car

I come by bus

I come on bike

I come on a horse

ఇప్పుడు ఇంకొక కామన్ ఎర్రర్ చూద్దాం.

He is my own brother

కొంతమంది ‘హీ ఈస్ మై ఓన్ బ్రదర్’ అంటూ ఉంటారు. ఇది తప్పు అని చెప్పలేము కానీ, తప్పే.

అదేంటి సర్ అలా అంటున్నారు అంటె, ఇంగ్లీష్ భాషలో బ్రదర్, సిస్టర్ అనే పదాలు స్వంత అన్నదమ్ముల గూర్చి, స్వంత అక్కచెల్లెళ్ళ గూర్చి మాత్రమే వాడతారు.

మిగతా వారి గూర్చి కజిన్ అనే అంటారు.

పెద్దనాన్న కొడుకు, చిన్నాయన కొడుకుని ఎవరికైనా పరిచయం చెస్తూ మనం తెలుగు వాడుక ప్రకారం అతన్ని తెలుగులో అన్న అనో, తమ్ముడు అనో అని అంటాము, మన స్వంత అన్నదమ్ముల గూర్చి చెప్పేటప్పుడు, అందుకే స్వంత అన్న అని, స్వంత తమ్ముడు అని చెబుతూ ఉంటాము.

కానీ ఇంగ్లీష్ భాషలో ఈ అవసరం రాదు. వాళ్ళ అలవాటు ప్రకారం స్వంత అన్నదమ్ములని ‘బ్రదర్’, స్వంత అక్కచెల్లెళ్ళని ‘సిస్టర్’ అని అంటరు.

అదే పెద్దనాయన కొడుకుని, కూతురిని కజిన్ అని అంటే సరిపోతుంది.

అఫ్‍కోర్స్ ఈ కజిన్ అనేది ఇంగ్లీష్‌లో విస్తృతంగా వాడవచ్చు.  అంటే మన భారతీయ సంస్కృతిలో ఉన్నంత విస్తృత కుటుంబ సంబంధాలు, ఆయా బంధువర్గాలకు ప్రతి ఒక్క బంధుత్వానికి మనకు ప్రత్యేకంగా పేరు ఉంటుంది.

కానీ ఇంగ్లీష్‌లో ఉత్తిగా అంకుల్ అనేస్తారు.

పెదనాయన, చిన్నాయన అని అంటాము, మేనమామ, అంటాము మనం ప్రత్యేకంగా ఆయా బంధువులని. కానీ వీళ్ళందరినీ అంకుల్ అనేస్తారు. కాకపోతే మాటర్నల్ అంకుల్ అని, పాటర్నల్ అంకుల్ అని తోకలు తగిలిస్తారు.

మొత్తం మీద, స్వంత అన్న, స్వంత తమ్ముడు అని అనాల్సిన అవసరం మన భాషలో ఉంది. కానీ వారి భాషలో స్వంత అన్నదమ్ములను మాత్రమే బ్రదర్ అని అంటారు, మిగతావారిని అందరినీ కజిన్ అనేస్తారు.

సరి అయిన ఉదాహరణలు కింద ఇస్తున్నాను:

He is my brother

She is my sister

He is my cousin

ఇప్పుడు ఈ కజిన్‌తో ఇమిడి ఉన్న మరో కామన్ ఎర్రర్ గూర్చి చెప్పుకుందాం.

సాధారణంగా తెలుగు వాళ్ళు చేసే మరొక పొరపాటు ఏమిటి అంటే, He is my cousin brother, she is my cousin sister అని అంటూ ఉంటారు.

ఇంగ్లీష్ భాషలో ఉత్తిగా కజిన్ అంటే చాలు.

మరి ఆ కజిన్ అమ్మాయా, అబ్బాయా ఎలా తెలుస్తుంది అంటే, ఆ సంభాషణలో వాళ్ళు చెప్పే మిగతా ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి తెలుసుకోవాల్సిందే, అంతే కానీ ఈ కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనే పదప్రయోగం ఇంగ్లీష్ భాషలో లేదు.

సరి అయిన ఉదాహరణలు ఇక్కడ ఇస్తున్నాను

He is my cousin

She is my cousin

Myself Anand

కొంత మంది తమను తాము పరిచయం చేసుకునేటప్పుడు, Myself Anand అని ఇలా తమ పేరు ముందు మైసెల్ఫ్ అని జత చేసి చెబుతుంటారు.

పరిచయం చేసుకునే టప్పుడు, పేరు చెప్పుకునేటప్పుడు ఇలా మైసెల్ఫ్ అనే పదప్రయోగం ఎక్కడాలేదు. అది మన భారతీయులకు ప్రత్యేకం.

సరి అయిన ఉదాహరణలు చూడండి.

I am Anand

My name is Anand

ఇలా చెప్పవచ్చు. అంతేకానీ ఈ Myself Anand అనేటటువంటి పదప్రయోగం ఎక్కడాలేదు.

Myself అనే పద బంధాన్ని, ’నా అంతట నేను’ అనే అర్థంలో వాడవచ్చు. మీరేదైనా పని స్వయంగా చేస్తుంటే, ఇలా చెప్పవచ్చు, I finished the work myself. అంతే కానీ నా పేరు అనే అర్థంలో ఈ మైసెల్ఫ్ వాడకూడదు.

Stage fear

ఇది చాలా బాగా వాడుకలో ఉన్న కామన్ ఎర్రర్.

ఇంగ్లీష్ భాషలో వేదిక అనే అర్థం లో స్టేజ్ అనే పదం ఉంది.

భయం అనే అర్థం లో ఫియర్ అనే పదం ఉంది.

కానీ స్టేజి మీద నిలబడి మాట్లాడటానికి భయం అనే అర్థం లో ‘స్టేజి ఫియర్’ అనే పదాన్ని ఎక్కడా వాడరు,

సరి అయిన పదం ఏమిటి అంటే, Stage Fright.

I lost my stage fright

He overcame his stage fright అనే పద ప్రయోగాలు కరెక్ట్.

ఇకపై స్టేజ్ ఫియర్ అనే పదం వాడకండి, అలాంటి సందర్భాలలో స్టేజిఫ్రయిట్ అనే పద ప్రయోగం చేయాలి సుమా.

Father name/Mother name

తెలుగులో మా నాన్నగారి పేరు, అమ్మగారి పేరు అని అన్నా కరెక్టే, అదే విధంగా మా నాన్నగారి యొక్క పేరు, మా అమ్మ గారి యొక్క పేరు అన్నాకూడా కరెక్టే. కానీ మనం వాడుక భాషలో ఎక్కువగా మా నాన్న పేరు, మా అమ్మ పేరు అని అనేస్తూ ఉంటాము. ఈ యొక్క అనే పదం వాడము ప్రత్యేకంగా.

కానీ ఇంగ్లీష్ భాష విషయానికి వచ్చేటప్పటికి,

My father name (X)

My mother name (X) తప్పు అనే చెప్పాలి.

ఎందుకంటే ఫాదర్ తరువాత అపాస్ట్రఫీ ఎస్ వాడాలి అంటే, father’s వాడాలి. అంటే ’s  అన్నమాట.

ఈ అపాస్ట్రఫీ (’s) ఇక్కడ యొక్క అన్న అర్థాన్ని సూచిస్తుంది

కాబట్టి ఫాదర్స్ నేమ్ (father’s name), మదర్స్ నేమ్ (mother’s name) అనే పద్దతిలోనే వాడాలి.

కానీ దురదృష్టవశాత్తు చాలా పేరు పొందిన ప్రయివేటు కంపెనీలు సైతం తమ తమ అప్లికేషన్ ఫారంలో ఇలా తప్పుగా అపాస్ట్రఫీ లేకుండా వ్రాస్తూ ఉంటారు.

my father’s name is…(correct)

my mother’s name is ….( Correct)

I am like this only

నేనింతే అనే అర్థం లొ చాలా మంది అయం లైక్ దిస్ ఓన్లీ అనేస్తూ ఉంటారు.

ఇలాంటి ప్రయోగం ఇంగ్లీష్ భాషలో లేదు.

మరి సరి అయిన పద ప్రయోగం ఏమిటి అంటే,

This is the way I am

This is the way he is

This is the way she is

This is the way we are

This is the way they are

ఇలా సాగుతాయి కరెక్టు ఎక్స్‌ప్రెషన్స్.

వచ్చేవారం కూడా మరిన్ని కామన్ ఎర్రర్స్ గూర్చి తెలుసుకుందాము.

సిద్దమేనా. ఎదురు చూస్తూ ఉండండి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here