Site icon Sanchika

ఈజీగా ఇంగ్లీష్ ఛాప్టర్ 7

[dropcap]మీ[/dropcap]రు తెలుగు మీడియమా? అయితే ఇది మీ కోసమే. ఇకపై మీరు మాతృభాషలాగా ఇంగ్లీష్ మాట్లాడగలరు. MNC జాబ్ తెచ్చుకోగలరు.

~

బూట్ క్యాంపు – మూడవరోజు

“మనం ఈ రోజు గోల్ సెట్టింగ్ అనే అంశం సాధన చేద్దాము. అందరూ సిద్ధమేనా?”

సంతోష్ బోర్డ్ వైపు తిరిగి “మీ గోల్ ఏమిటి” అని వ్రాశాడు.

తరువాత ఆడియెన్స్ వైపు తిరిగి “మీ గోల్ ఏమిటి?” అని అడిగాడు సంతోష్.

I want to be successful అని ఒకరు

I want to be rich అని ఒకరు

I want to be a software engineer అని ఒకరు

I want to go abroad అని ఒకరు

I want to be very popular అని ఒకరు

I want to be an industrialist అని ఒకరు

ఇలా అందరూ సమాధానాలు చెప్పారు.

నవ్వుతూ ఎంకరేజి చేశాడు అందర్నీ వాళ్ళ వాళ్ళ గోల్స్ చెప్పేలాగా.

“వెరీ గుడ్. మీ అందరూ మీ డ్రీమ్స్‌ని షేర్ చేసుకున్నారు. మీ డ్రీమ్స్ గోల్స్‌గా మారినప్పుడే వాటిని మీరు అఛీవ్ చేయగలరు. లేదా అవి ఉత్తి కలలుగానే మిగిలిపోతాయి”

అందరూ అతని వంక ప్రశ్నార్థకంగా చూస్తుండిపోయారు. ‘అదేంటి మేము చెప్పింది మా గోల్స్ గురించే కద. వాటిని ఉత్తి డ్రీమ్స్ అంటాడేమిటి’ అని అందరూ అనుకున్నారు.

సంతోష్ చెప్పటం ప్రారంభించాడు “మన సబ్-కాన్షస్ మైండ్ ఒక కాబ్ డ్రయివర్ లాంటిది. మనం కాబ్ (టాక్సీ) ఎక్కి కూర్చున్నాక మనం ఎక్కడికెళ్ళాలనుకున్నామో ఎంత స్పష్టంగా చెబితే, అంత ఖచ్చితంగా మనం కోరిన ప్రదేశానికి తీస్కుపోగలడు.

అలా కాకుండా మనం అస్పష్టంగా

‘నాకు బాగుండే దగ్గరికి తీస్కు వెళ్ళు’

‘విశాలంగా ఉండే ప్రదేశానికి తీస్కువెళ్ళు’

‘నాకు ఆనందం కలిగించే ప్రదేశానికి తీస్కువెళ్ళు’ అని చెప్పి ఇలా అస్పష్టంగా మనం సూచనలు ఇచ్చాం అనుకోండి, కాబ్ డ్రయివర్ కాబ్‌ని స్టార్ట్ చేయడు. మన వంకే చూస్తుండిపోతాడు. ఎక్కడికెళ్ళాలో స్పష్టంగా చెప్పేదాకా బండి కదలదు.

మన సబ్-కాన్షస్ మైండ్ కూడా అంతే. మనం జీవితంలో ఏది సాధించాలో స్పష్టమైన ప్రణాళీకతో మనం కలలు కనటం ప్రారంభిస్తే, మనల్ని తప్పకుండా అక్కడికి చేరుస్తుంది.

మన కలలు ఎంత స్పష్టం ఉంటే ఆ కలలు నిజం అయ్యే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

మీ అందరికీ మంచి కలలు ఉన్నాయి. మొదట అది అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మన విజయానికి మొదటి మెట్టు కలలు కనటం. కలలు అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు వచ్చే కలలు కాదు, పగటిపూటే కాన్షస్ మైండ్‌తో స్పష్టమైన ఆలోచనలలో, ‘నేను ఫలానా పొజిషన్ సాధించాలని అనుకుంటున్నాను’ అనే ఆలోచన కలగటమే కల.

‘విజేతగా నిలవాలని’

‘ధనవంతుడవ్వాలని’

‘సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలని’

‘విదేశాలలో స్థిరపడాలని’

‘పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని’

‘ఒక పెద్ద పారిశ్రామిక వేత్తని అవ్వాలని’ అనుకోవటం ఇవన్నీ కూడా మంచి ఆలోచనలే. ఇవే కలలు. ఈ కలలే మీ విజయానికి మొదటి మెట్టు.

కల అంటే ఇంగ్లీష్‌లో DREAM అంటాము కద. ఇది D అనే అక్షరంతో ప్రారంభం అవుతుంది.

ఈ D కి మరో అయిదు D లు కలిస్తే అప్పుడు అది గోల్ అవుతుంది. మన సబ్-కాన్షస్ మైండ్ మన గోల్స్‌ని తప్పక నెరవేరేలా చూస్తుంది.

ఆ అయిదు D లు ఏమిటి అంటే

మీ కలకి ఈ అయిదు అంశాలు జోడిస్తే అప్పుడు అది గోల్ అవుతుంది. ఇప్పుడు ఈ అయిదు D లు జత కలిసిన మన డ్రీంని తప్పక నెరవేరేలాగా మన సబ్-కాన్షస్ మైండ్ ఖచ్చితంగా పని ప్రారంభిస్తుంది. మీకు ఒక స్పష్టమైన సందేశాలని ఇస్తుంది. మీకు అవకాశాలని వెదికి పెడ్తుంది. ఇది నిజం. ఎందరో విజేతలని ప్రత్యక్షంగా కల్సి వారిని ఇంటర్వ్యూచేసి నేను రూఢీ చేసుకుని మరీ వ్రాస్తున్నాను ఈ విషయాలు.

ఈ 5 D లలో ఏ ఒక్కటి లోపించినా కూడా మీ కల కలగానే మిగిలిపోతుంది.

మీకు ఒక రహస్యం చెబుతాను. ఈ అయిదు D లలో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా మీ కలకి జతచేస్తే మీ కల ఒక స్పష్టమైన లక్ష్యంగా మారుతుంది. సహజంగానే మీ లక్షం నెరవేర్చటంలో మీకు మీ సబ్‍కాన్షస్ మైండ్ తోడవుతుంది.

చక్కగా అనర్ఘళంగా ఇంగ్లీష్ మాట్లాడటం మీ కల కదా. అది నెరవారాలంటే మీరు ఆ కలని ఒక గోల్‌గా మార్చుకుంటే తప్ప మీ కల నెరవేరదు.

Direction:

మీ కల ఇంగ్లీష్ మాట్లాడటం. ఇక మీ ప్రతి అడుగు ఆ దిశగానే పడాలి. అప్పుడే మీ కల నెరవేతుతుంది. మీ డైలీ టైం టేబుల్‌లో ఇంగ్లీష్ మాట్లాడటానికి ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. బాగా ఇంగ్లీష్ వచ్చిన మిత్రులతో, అదే విధంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అని మీ లాగా కలలు కనే మిత్రులతో ఒక ఒప్పందం చేసుకుని, ఒక గ్రూప్ లాగా ఏర్పడి. ప్రతి రోజు కొన్ని గంటలు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి.

మీ అభిరుచులకు సరిపడే ఒక మంచి యూట్యూబ్ చానెల్ ఎన్నుకుని ఇంగ్లీష్‌లో ప్రొగ్రామ్స్ చూడాలి. అవి టాక్ షోస్ కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు ఏదైనా సరే ఇంగ్లీష్ లోనే ఉన్న యూట్యూబ్ కార్యక్రమాలు ఎన్నుకోవాలి.

బుక్స్ చదవటం, అడ్వర్టైజ్‌మెంట్లు చదవటం, మిత్రులతో ఇంగ్లీష్‌లో డిబేట్స్‌లో పాల్గొనటం చేయొచ్చు.

ఏదయినా చక్కటి పేరున్న స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్సిట్యూట్‌లో చేరి మాట్లాడటం ప్రాక్టీస్ చేయవచ్చు.

ఇలా మీ ప్రతి అడుగు, ప్రతి ఆలోచనా, ప్రతి పలుకు మీ కలని నెరవేర్చుకునే దిశగా ఉండాలి.

Determination:

ధృఢమైన నిర్ణయం. పట్టువదలని దృఢ సంకల్పం ఉంటేనే ఏదయినా సాధించగలము. ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక వెనక్కు తగ్గేది లేదు అన్నటువంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులనే విజయం వరిస్తుంది. ప్రతి రోజు ఒక అరవై నిమిషాలు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి అని మీరు గట్టిగా నిర్ణయించుకున్నారనుకోండి, ఆరు నూరయినా, నూరు ఆరయినా ఆ సంకల్పం వదలవద్దు.

కొన్నేళ్ళ క్రితం పెప్సీ ప్రకటనలో సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వచ్చి “యే దిల్ మాంగే మోర్” అని అరుస్తాడు ఆడ్ చివర్లో. అంటే ’ఇంకాస్తా కావాలంటోంది మనసు’ అని అర్థం చెప్పుకోవచ్చు.

ఇదే విషయాన్ని మన ప్రయత్నాలకు కూడా వాడుకోవచ్చు. అంటే, రోజు కొంత ఎక్కువ శ్రమ చేసుకుంటూ పోవాలి మీ కలలు నెరవేరే దిశగా.

పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రమిస్తూ ఉంటే విజయం మీ స్వంతం అవుతుంది.

Dedication:

అంకిత భావంతో కూడిన ప్రయత్నము.

ఇంగ్లీష్ భాష మనకు కొత్త ఏమి కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఒక సబ్జెక్టుగా ఉంది. మనకు తెలుగులో కంటే ఇంగ్లీష్ భాషలోనే వాడుకలో ఎక్కువ పదాలు తెలుసు. అయినా ఎందుకు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడలేకపోతుంటాము?

ఇది ఎవరికి వారు సిన్సియర్‌గా తమని తాము ప్రశ్నించుకోవాల్సిన అంశం.

ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు పూర్తి ఏకాగ్రతతో, మనస్సు పెట్టి చేస్తే ఆ పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది.

ప్రతి రోజు కొత్త పదాలు నేర్చుకోవటం, నేర్చుకున్న పదాలు పదే పదే గుర్తు తెచ్చుకోవడం, ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా ఇంగ్లీష్‌లో మాట్లాడే ప్రయత్నం చేయటం, ఎవరితో అయినా మాట్లాడాల్సి వచ్చినపుడు, మీరే, ఎదుటి వాళ్ళతో ఇంగ్లీష్‌లో సంభాషణ మొదలెట్టడం, తప్పు కానివ్వండి, ఒప్పు కానివ్వండి మాట్లాడటం ప్రధానం.

ఇలా అంకిత భావంతో మీరు ప్రయత్నాలు మొదలెట్టినప్పుడే, మీ కలని మీరు లక్ష్యంగా మలచుకున్నవారు అవుతారు.

Discipline:

ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యాలు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ అది నిజం.

జీవితంలో గోల్ సెట్టింగ్ ముఖ్యం కాదు, టైం మేనేజిమెంట్ స్కిల్స్ నేర్చుకోవటం ముఖ్యం కాదు, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకోవటం ముఖ్యం కాదు, పుస్తకాల ద్వారా, క్లాసు రూం ట్రెయినింగ్స్ ద్వారా ఙ్జానాన్ని అభివృద్ది చేసుకోవడం ముఖ్యం కాదు.

ఏమిట్రా ఇలా చెబుతున్నాడు అని అనుకుంటున్నారా?

అవునండి, ఇవేవి ముఖ్యం కాదు. వీటన్నిటికన్నా అతి ముఖ్యమయినది డిసిప్లిన్. అందునా Consistent Self Discipline అత్యంత ముఖ్యమైనది.

నిరంతరమైన స్వీయ నియంత్రణ అన్నింటికన్నా అత్యంత ప్రాముఖ్యమైనది. లేకుంటే మీ కలలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి.

మీరు మీ నిరంతరమైన స్వీయ నియంత్రణ (Consistent Self Discipline ) ఎక్కడ అమలు చేయాలి?

మీ ఆలోచనల మీద మీ స్వీయ నియంత్రణ చూపాలి.

మీ అలవాట్ల మీద మీ స్వీయ నియంత్రణ చూపాలి.

మీ లెర్నింగ్ మీద మీ స్వీయ నియంత్రణ చూపాలి.

ఒక క్షణం వెలిగి ఆరిపోయే మతాబులా కాకుండా నిరంతరం జ్వలిస్తూ ఉండే అఖండ దీపంలా మీ కలల దీపాల్ని వెలిగించుకోవటంలో మీరు మీ స్వీయ నియంత్రణ చూపాలి.

ఇక్కడ ఒక చిన్న పట్టిక ఇస్తాను చూడండి. దీన్ని 1% ప్రిన్సిపుల్ అంటారు.

1 టుది పవరాఫ్ 365 = 365

అంటే మీరు రోజు చేయాల్సిన్స పనిని ఎంతో శ్రద్ధగా డిసిప్లిన్డ్‌గా చేసుకుంటూ వెళితే మీరు అనుకున్న లక్ష్యాలను అనుకున్నవి అనుకున్నట్టు సాధించగలరు.

1.01 టుది పవారాఫ్ 365 = 37.8

మీ కలల్ని నిజం చేసుకునే దిశగా, మీరు నిన్న చేసిన పనికి జస్ట్ 1% ఎక్కువ పని చేశారు ఈ రోజు అనుకుందాము.

అదే విధంగా సంవత్సరమంతా, ప్రతీ రోజు క్రితం రోజుకన్నా 1% ఎక్కువ పనిని మీరు మీ కలల వైపు చేసుకుంటూ వెళ్ళారు అనుకుందాం. అప్పుడు మీరు 3780 రెట్లు అధిక ఫలితాలు పొందగలరు.

దీనికి కావాల్సిందల్లా Consistent Self Discipline

0.99 టుది పవారాఫ్ 365 = 0.03

కేవలం 0.01 శాతం ప్రయత్న లోపం జరిగినా ప్రతి రోజు చేస్తూ వెళ్ళినా, ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అంటే, మీరు రెగ్యులర్‌గా చేయాల్సిన పనిని జస్ట్ ఒక 0.01 శాతం తగ్గించుకుంటూ వెళితే ఫలితాలు ఎంతగా తారుమారయ్యాయి చూడండి.

మీరు అనుకున్న కలలో కేవలం 0.03 శాతం మాత్రమే మీరు సాధించగలరు అన్న మాట.

ఇక అప్పుడప్పుడూ, తోచినప్పుడు మాత్రమే తమ కలల దిశగా అడుగులు వేసే వారి గూర్చి ఏమి చెప్పమంటారు?

కాబట్టి ప్రయత్నం చేయటంలో ఎటువంటి వెనుకంజ వేయవద్దు.

Consistent Self Discipline తో రోజు రోజుకు మీరు ప్రాక్టీస్ చేసే సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళటమే విజయానికి తారకమంత్రం.

Deadline:

డెడ్‍లైన్ అంటే చివరితేది. మీరు ఏ పని చేయదలచుకున్నా, దానికి ఒక స్పష్టమైన కాల నిర్ణయం చేసుకోవాలి.

మీ కలల్ని స్పష్టమైన సినిమాలాగా మనసు తెరపై చూసుకుంటుండాలి తరచుగా.

ఒక స్పష్టమైన ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకోవాలి.

మీ మొత్తం కలని సీన్ బై సీన్ విడగొట్టుకుని, రాగల పదేళ్ళలో ఏమి చేయాలి, రాగల అయిదేళ్ళలో ఏమి చేయాలి, వచ్చే రెండు సంవత్సరాలలో ఏమి చేయాలి, అని కాగితం మీద వ్రాసుకుని, ఇక ఆ కలలకి అనుగుణంగా మీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. ఆ తరువాత తేదీల వారిగా మీ కలల్ని అమలుచేసుకుంటూ పోవడమే.

***

ఇక రెండవది అతి ప్రధానమయినది, గోల్స్ (లక్ష్యాలు) ఎలా అందుకోవాలి.?

ఇప్పుడు గోల్స్ ఎలా నెరవేర్చుకోవాలో చెబుతాను.

ఉత్తిగ కలలు ఉంటే సరిపోదు. ఆ కలల్ని స్పష్టమయిన లక్ష్యాలుగా మార్చుకోవాలి. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే, మీ విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.

పరాజితులు ఉత్తి కలల్ని మాత్రమే కంటారు. విజేతలు స్పష్టమయిన లక్ష్యంతో ముందుకు సాగుతారు.

విజేతలకు పరాజితులకు ఉన్న ఒకే ఒక తేడా ఇదే.

SMART GOALS:

Dream + 5 D’s = Goal

SMART + Goal = Guaranteed Success

గోల్స్ స్పష్టంగా ఉంటే మన విజయం ఖాయం. కానీ ఇందుకు గాను మనం పాటించాల్సిన కొన్ని మెలకువలు ఇక్కడ చెబుతాను.

(వచ్చే వారం: స్మార్ట్ గోల్స్, సులభంగా గోల్ అఛీవ్ చేయటానికి వర్క్ షీట్స్ ఇస్తున్నాను. సిద్ధంగా ఉండండి)

Exit mobile version