Site icon Sanchika

ఏడ దాగావు కోకిలా

గున్నమావి కొమ్మల్లో కుహు కుహు నాదాల కోయిలా
ఏడ దాగావు, నువ్వేల దాగావు
మదురమయిన నీ స్వరం తెలుగు తల్లికి ముత్యాల హారం
తెలుగు బిడ్డలకు అది ఒక వరం
కొమ్మ కొమ్మకూ రెమ్మ రెమ్మకూ వాలి
మదిలోన ఆనందాన్ని నింపిన ఓ కోయిలా…
ఏడ దాగావు, నువ్వేల దాగావు
నల్లని దానినని నొచ్చుకున్నావా
లేక మా తెల్లని రంగు చూసి చిన్నబోయావా
పిచ్చి తల్లీ! వెన్నలాంటి మనసున్న నీవు మల్లెకన్నా తెల్లనేలే
సిరిమల్లెకన్నా తెల్లనేలే
నీ మధుర కంఠము, మధుర స్వరం మూగబోతే
కవి కోయిలలు పుట్టేదేలా కోకిలా
ఏడ దాగావు… నువ్వేల దాగావు.

Exit mobile version