Site icon Sanchika

ఎదగాలి

[box type=’note’ fontsize=’16’] “ఏ కులమైతేనేం ఏ మతమైతేనేం వారు ఇద్దరూ ఒకటవ్వాలని కోరుకున్నప్పుడు మనం ఒకటి చేయలేమా” అని ప్రశ్నిస్తూ, పరువు హత్యలను ఆపాలంటున్నారు ఎన్.కె.బాబు ఈ కవితలో. [/box]

[dropcap]చి[/dropcap]త్రమైనది మనసు
ఎప్పుడు ఎవరిపై
ఎందుకు మళ్లుతుందో
చెప్పలేనిది మనసు

ఎందుకు అంటే
ఒక్కోసారి
సారీ
కారణం ఉండదు

ఆ కారణంగానే
పడిపోతుంది
అది ఎవరి పైన చెప్పలేదు
దానికి కులం మతం, రంగు ,
అంతస్తు భేదం లేదు.

మనసుకు కల్లా కపటం తెలియదు
మనసుపడ్డ వారితో తనను తాను కట్టిపడేసుకుంటుంది
అది నేరం కాదు
తన నైజం

అయినా ఇప్పుడు ఏమైందని
మనసు పడ్డ వారితో
మనువు జరపడంలో బాధేముంది
మనమంతా భారతీయులం
మనమంతా ఒక్కటే అని
చిన్ననాటి నుండి ప్రతిరోజు చేస్తున్న
ప్రతిజ్ఞ ఆచరణ నియంకాదా
మరి ఏ కులమైతేనేం
ఏ మతమైతేనేం
వారు ఇద్దరూ ఒకటవ్వాలని కోరుకున్నప్పుడు
మనం ఒకటి చేయలేమా
మారుదాం మనం మారుదాం
చాటుదాం మానవులంతా ఒక్కటే అని చాటుదాం.

పరువు హత్యలు ఆపుదాం.

Exit mobile version