[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.
‘సంచిక’ పాఠకుల రోజు రోజుకి పెరుగుతుండడం ఆనందం కలిగిస్తోంది. పత్రిక బాధ్యతను పెంచుతోంది.
పాఠకులను విభిన్నమయిన రచనలతో అలరించాలని ‘సంచిక’ పత్రిక ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’. త్వరలో సంచికలో బాబా బందా సింగ్ బహాదూర్ చారిత్రక ఫిక్షన్ నవల ధారావాహికంగా ప్రారంభవుతుంది. మరొకొన్ని సాంఘిక నవలలు కూడా ధారావాహికంగా రానున్నాయి.
సంచికలో ఇటీవలే ప్రారంభయిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరాయ ఆత్మకథ తెలుగు అనువాదం చదువరులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరొక ఆత్మకథ అనువాదాన్ని కూడా త్వరలో అందించనున్నాము.
‘సంచిక’ ప్రచురిస్తున్న ‘రామకథాసుధ’ కథా సంకలనం కూడా త్వరలో విడుదల కానుంది.
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఏప్రిల్ 2023 సంచిక..
~
సంచికలో 1 ఏప్రిల్ 2023 తేదీన ప్రచురితమవుతున్న రచనల వివరాలివి.
సంభాషణం:
- శ్రీమతి రోహిణి వంజారి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో..12 – వి. శాంతి ప్రబోధ/ మోటమఱ్ఱి సారధి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- ఏప్రిల్ 2023- దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -37 – ఆర్. లక్ష్మి
కవితలు:
- ప్చ్..! బ్యాడ్ లక్..!! – శ్రీధర్ చౌడారపు
- పండగతో ఒక మాట – డా. విజయ్ కోగంటి
కథలు:
- నగరంలో మరమానవి-7 – చిత్తర్వు మధు
- సోషల్ మీడియా వైద్యం – గంగాధర్ వడ్లమాన్నాటి
- విజ్ఞానపు విన్యాసం – సిహెచ్. సి. ఎస్. శర్మ
- జ్ఞాపకనాశిని – వి. బి. సౌమ్య
పుస్తకాలు:
- బాల్యాన్ని గుర్తు చేసే ‘మా బాల కథలు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
బాల సంచిక:
- కథ వ్రాయాలి – కంచనపల్లి వేంకటకృష్ణారావు
అవీ ఇవీ:
- ధర్మ ప్రవచన దక్షుడు ‘వ్యాఘ్రపాద మహర్షి’ – అంబడిపూడి శ్యామసుందర రావు
ఎప్పటిలాగే మీ సూచనలు, సలహాలతో సంచికను ముందుకు నడిపిస్తారన్న విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం