[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి జోతలు.
విశిష్టమైన, విభిన్నమైన రచనలు పాఠకులకు అందించేందుకు ‘సంచిక’ నిరంతరం ప్రయత్నిస్తోంది.
‘సంచిక’ ప్రచురించే రచనలు విభిన్న దృక్కోణాలను, భిన్న స్వరాలను ప్రతిబింబిస్తున్నాయి.
చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
డా. సాధనా శంకర్ గారి ఆంగ్ల సైన్స్ ఫిక్షన్ నవల ‘Ascendance’ కు తెలుగు అనువాదం ‘ఆరోహణ’ ధారావాహికగా ఈ నెల నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఈ నవల హిందీ, మరాఠీ భాషలలోకి అనువాదమై పుస్తక రూపంలో వచ్చి పాఠకులను అలరించింది.
పాఠకుల కోసం కొత్తగా ‘వందే గురుపరంపర’ కాలమ్ ఈ నెల నుంచి ప్రారంభమవుతోంది.
ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక విశ్లేషణ, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 ఆగస్టు 2024 సంచిక.
1 ఆగస్టు 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- కవి, విమర్శకులు డా. దార్ల వెంకటేశ్వరరావు అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
ధారావాహిక:
- ఆరోహణ-1 – ఆంగ్ల మూలం: సాధనా శంకర్, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
కాలమ్స్:
- శ్రీ మహా భారతంలో మంచి కథలు-12 – కుంతి
- సగటు మనిషి స్వగతం-3 – సగటు మనిషి
- ఆదాబ్ హైదరాబాద్.. -2 – పి. జ్యోతి
- వందే గురు పరంపరా – ఉపోద్ఘాతం – చివుకుల శ్రీలక్ష్మి
పరిశోధనా గ్రంథం:
- శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-4 – పాణ్యం దత్తశర్మ
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- ఆగస్టు 2024 – టి. రామలింగయ్య
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా – 53 – ఆర్. లక్ష్మి
- అతీత జగత్తుకు సహృదయుని పరిణామం – కోవెల సుప్రసన్నాచార్య
- తాంబూలం పుచ్చుకుందమ సుదతిరో – శీలా సుభద్రాదేవి
కథలు:
- గాంధి (అనువాద కథ) – కన్నడ మూలం: డా. బెసగరహళ్ళి రామణ్ణ, అనువాదం: రంగనాథ రామచంద్రరావు
- మేజిక్ వాటర్ – గంగాధర్ వడ్లమన్నాటి
- సన్ ఫ్లవర్స్ – చిత్తర్వు మధు
కవితలు:
- ప్రేమంటే మజాకా! – శ్రీధర్ చౌడారపు
- అంతే! – డా. విజయ్ కోగంటి
- డెబిట్ క్రెడిట్ – వారాల ఆనంద్
పుస్తకాలు:
- కరోనా కాలంలో అమెరికాలో తెలుగు పూజారుల జీవన పోరాటం – పుస్తక విశ్లేషణ – ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ
- కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విలక్షణమైన నవల: మ్రోయు తుమ్మెద – ఒక విశ్లేషణ – సబ్బని లక్ష్మీ నారాయణ
బాలసంచిక:
- కింకిణీ చెట్టు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
- అందమైన కానుక – సలీం సయ్యద్
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.