Site icon Sanchika

సంపాదకీయం డిసెంబర్ 2024

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విశిష్టమైన, విభిన్నమైన రచనలు అందించేందుకు ‘సంచిక’ చేస్తున్న నిరంతర కృషి కొనసాగుతోంది.

దీపావళి సందర్భంగా ‘సంచిక’ – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథలను ప్రచురించాము.  సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల ప్రచురణ ఈ నెల నుంచి మాసపత్రిక లోనూ, వారపత్రిక లోనూ ప్రారంభమవుతోంది.

కథల పోటీలు విజయవంతమైన నేపథ్యంలో, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా పద్యకావ్యాలు, వచనకవితల పోటీ నిర్వహిస్తోంది ‘సంచిక’. ‘సంచిక-డాక్టర్ అమృతలత’ల తరఫున పద్య కావ్య రచన పోటీని నిర్వహిస్తున్నారు మాన్యులు, పండితులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు. పద్య కావ్య రచన పోటీ వివరాలు ఈ లింక్‌లో చూడవచ్చు.

https://sanchika.com/2025-ugadi-padayakavya-potee-prakatana/

‘సంచిక- సాహితీ ప్రచురణ’ల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర. ఈ పోటీ వివరాలు ఈ లింక్‌లో చూడవచ్చు.

https://sanchika.com/2025-ugadi-vachana-kavitala-potee-prakatana/

విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలుగా, ‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు నిలుస్తున్న సంగతి తెలిసినదే. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఆంగ్ల విభాగంలో ఈ నెల – ఇద్దరు కవుల రెండు కవితలను అందిస్తున్నాము.

ఎప్పటిలానే ఇంటర్వ్యూ, కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథ, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 డిసెంబర్ 2024 సంచిక.

1 డిసెంబర్ 2024 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంభాషణం

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

English Section:

~

ఈ నెల 1వ తేదీ, ఆదివారం ఒకే రోజు అయినందున, ఈ రోజు ‘సంచిక వారపత్రిక’ కూడా విడుదలవుతోంది.

1 డిసెంబర్ 2024 నాటి ‘సంచిక వారపత్రిక’లోని రచనలు:

ప్రత్యేక ఇంటర్వ్యూ:

సీరియల్స్:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

భక్తి:

ఆత్మకథ/స్వీయచరిత్ర:

కథలు:

2024 దీపావళి పోటీ సాధారణ ప్రచురణ కథలు:

పద్యకావ్యం:

కవితలు:

పుస్తకాలు:

సినిమాలు/వెబ్ సిరీస్:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version