Site icon Sanchika

సంపాదకీయం జూలై 2022

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న సహృదయులకు నమోవాకాలు.

యువ రచయితలను ప్రోత్సహించేందుకు, కొత్త పాఠకులని చేరుకునేందుకు సంచిక నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది.

ఆ ప్రయత్నంలో భాగంగా నిపుణులైన సీనియర్ రచయితలతో ఆయా జానర్‍లపై చర్చలు నిర్వహించి, ఆసక్తి కలిగిన వర్ధమాన రచయితలనూ, పాఠకులనూ ఆ సమావేశాలకు ఆహ్వానిస్తుంది.

జూన్ నెల చివరి వారంలో ‘తెలుగులో సైన్స్ ఫిక్షన్’ అనే అంశంపై చర్చ నిర్వహించింది.

2 జూలై 2022, శనివారం నాడు సంచిక-స్వాధ్యాయ, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖతో కలిసి ‘తెలుగులో హిస్టారికల్ ఫిక్షన్ రచనలు’ అనే సాహిత్య చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది. నారపల్లి లోని స్వాధ్యాయ గ్రంథాలయం హాల్‍లో ఉదయం 10 గంటలకు ఈ చర్చ ప్రారంభం.

చిరునామా:

స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్,

ఇంటి నెంబరు 4-48/12,

రోడ్ నెం.3, బాబానగర్, నారపల్లి,

ఘటకేసర్ మండల్, పోచారం మున్సిపాలిటీ,

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

హైదరాబాదు-500088

ఈ చర్చకు శ్రీ ఎం ప్రాణ్‌రావ్, చరిత్ర నవలల రచయిత; ప్రసిద్ధ రచయిత శ్రీ కస్తూరి మురళీకృష్ణ పానలిస్టులుగా వ్యవహరిస్తారు. అందరూ ఆహ్వానితులే.

ఇవే కాకుండా – రైలుకథలు, దేశభక్తి కథలు, తెలుగుకథల్లో గాంధీమహాత్ముడు, క్రీడాకథ, కులంకథ వంటి విభిన్నమూ, విశిష్టమయిన కథల సంకలనాలను అందించిన సంచిక-సాహితీ ప్రచురణలు సరికొత్త కథల సంకలనం అందించనున్నాయి. రచయితలకి దిగువ ప్రకటనలో ఆహ్వానం పలికింది సంచిక.

https://sanchika.com/invitaion-for-stories-for-anthology/

రచయితలు సానుకూలంగా స్పందించి తమ రచనలు పంపి కథా సంకలనం ప్రయత్నాన్ని విజయవంతం చేయగలరని సంచిక ఆశిస్తోంది.

సంచిక నిర్వహించబోయే కథల పోటీ వివరాలు త్వరలో..

~

ఎప్పటిలానే వ్యాసాలు, ఇంటర్వ్యూ, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ జూలై 2022 సంచిక.

1 జూలై 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కవితలు:

కథలు:

పుస్తకాలు:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version