Site icon Sanchika

సంపాదకీయం మార్చి 2024

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు, రచయితలకు అభివందనాలు. ‘సంచిక’ను ఆదరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విభిన్నమైన, విశిష్టమైన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకూ తావిచ్చేలా ‘సంచిక’ లోని రచనలు ఉండేలా కృషి చేస్తున్నాము.

ఇటీవల కాలంలో సాంఘిక మాధ్యమాలలో కవిత్వంపై జరుగుతున్న చర్చలను గమనించి – కవిత్వం రచించడానికి, చదవడానికి అధ్యయనం ఎంత అవసరమో తెలిపే డా. జి. వి. సుబ్రహ్మణ్యం గారి 1977 నాటి వ్యాసాన్ని పునఃప్రచురిస్తున్నాము.

కశ్మీరు సంపూర్ణంగా ఇస్లామికీకరణమవడానికి ప్రత్యక్ష సాక్షియైన శ్రీవరుడు రచించిన ‘జైన రాజతరంగిణి’ – తెలుగులో తొలిసారిగా వ్యాఖ్యాన సహిత అనువాదంతో త్వరలో ‘సంచిక’లో ప్రారంభం కానున్నది. అలాగే శ్మశానంలోని శవాలు, సమాధుల నడుమ జీవించేవారి జీవితాలలోని రాగానురాగాలు, ఆటుపోట్లు, సుఖదుఃఖాలను ప్రదర్శించిన హిందీ నవలకు డా. పుట్టపర్తి నాగపద్మిని గారి అనువాదం త్వరలో ‘సంచిక’లో మొదలవుతుంది. ఇవే కాకుండా పాఠకులను ఆకట్టుకునే మరికొన్ని ధారావాహికలూ రానున్నాయి.

పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న వంటి పురస్కారాలు అందుకున్న తెలుగువారి జీనవరేఖలను పరిచయం చేసే డా. రేవూరు అనంతపద్మనాభరావు గారి ఫీచర్ ‘సంచిక’లో ప్రారంభమవుతోంది.

ఇటీవల స్వర్గస్థులయిన ప్రముఖ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్‍కి నివాళిగా, వారి కళాప్రస్థానంపై ఒక విశేష రచనని ‘సంచిక’ పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నారు రోచిష్మాన్.

పాఠకుల ఆదరణను మరింతగా పెంచుకునేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, ఇంటర్వ్యూ, పిల్లల కథ, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మార్చి 2024 సంచిక.

1 మార్చి 2024 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

సీరియల్:

కాలమ్స్:

ప్రత్యేక వ్యాసం:

వ్యాసాలు:

కవితలు:

కథలు:

పుస్తకాలు:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version