Site icon Sanchika

సంపాదకీయం మే 2023

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి నమస్సులు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఇటీవలే భారతరత్న డా. మోక్షగుండం విశ్వేశ్వరాయ జీవితచరిత్ర అనువాదాన్ని, ప్రముఖ గాంధేయవాది డా. హెచ్. నరసింహయ్య ఆత్మకథ అనువాదాన్ని పాఠకులకు అందిస్తోంది. పరిశోధనాత్మక రచనలను పాఠకులకు అందించే లక్ష్యంలో భాగంగా డా. మంత్రవాది గీతా గాయత్రి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పిహెచ్‍డి పట్టా కోసం సమర్పించిన సిద్ధాంత వ్యాసం ‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ ను ధారావాహికంగా అందిస్తోంది. మరొకొన్ని సాంఘిక నవలలు కూడా త్వరలో ధారావాహికంగా రానున్నాయి.

చదువరుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

సంచిక స్వాధ్యాయ సంయుక్తంగా ఇటీవల రచయితల సమావేశం నిర్వహించి – ‘సంచిక’ను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ‘సంచిక’ చేపట్టబోయే కొత్త కార్యాచరణలను చర్చించి, వారి సహకారం కోరింది. వీలైనంత తరచుగా రచయితలతో సమావేశం అవుతూ కార్యక్రమాల గురించి చర్చిస్తూండాలని ‘సంచిక’ భావిస్తోంది.

‘సంచిక’ ప్రచురించిన ‘రామకథాసుధ’ కథా సంకలనం విడుదలై పాఠకాదరణ పొందుతున్నందకు రచయితలకు, పాఠకులకు సంచిక ధన్యవాదాలు తెలుపుతోంది.

ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 మే 2023 సంచిక.

1 మే 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

బాలసంచిక:

పుస్తకాలు:

సంచిక ప్రకటనలు:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version