Site icon Sanchika

సంపాదకీయం నవంబరు 2023

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు, రచయితలకు నమస్కారాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

‘సంచిక’లో ప్రచురితమవుతున్న అన్ని రచనలు, కథలు, అనువాద కథలు, కవితలు, అనువాద కవితలు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి.

పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో తెలుగు సాహిత్యం అధికంగా పాలస్తీనా స్వరమే వినిపిస్తోంది. తొలిసారిగా ‘సంచిక’ సాహిత్య వేదిక ఇజ్రాయెల్ స్వరాన్ని కూడా వినిపిస్తోంది. గత వారం ప్రచురించిన రెండు అనువాద కవితలు విభిన్న దృక్పథాలను వెల్లడించాయి. నాణేనికి రెండు వైపులా ప్రదర్శించాయి. రాబోయే కాలంలో మరిన్ని విభిన్న దృక్కోణాలకు, విభిన్న స్వరాలకూ చోటిస్తుంది విశిష్టమైన సాహిత్య వేదిక ‘సంచిక’.

‘సంచిక’ మాసపత్రికలో ప్రస్తుతం ‘అంతరిక్షంలో మృత్యునౌక’ అనే సైన్స్ ఫిక్షన్ ధారావాహిక కొనసాగుతున్న సంగతి తెలిసినదే. సైన్స్ ఫిక్షన్ అంటే ప్రత్యేకాసక్తి ఉన్న పాఠకుల కోసం త్వరలో మరో సైన్స్ ఫిక్షన్ అనువాదాన్ని అందించనున్నాము.

సాహిత్యపరంగానో, సాంకేతికంగానో కొన్ని పుస్తకాలు కొన్నిసార్లు మన ఊహలను ఆకర్షించి మన మనసులపై చెరగని ముద్ర వేస్తాయి! ప్రస్తుతం లేదా గతంలో మనకు ప్రేరణ కలిగించిన పుస్తకమేదో మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అటువంటి అద్భుతమైన రచనల గురించి తోటి పాఠకులతో పంచుకునేలా ఒక కొత్త ఫీచర్ త్వరలో ప్రారభించబోతున్నాము.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించాలన్న ‘సంచిక’ ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే సీరియల్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 నవంబరు 2023 సంచిక.

1 నవంబరు 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

సంభాషణం:

సీరియల్:

కాలమ్స్:

భక్తి:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కవితలు:

కథలు:

పుస్తకాలు:

బాల సంచిక:

అవీ ఇవీ:

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

Exit mobile version