Site icon Sanchika

సంపాదకీయం సెప్టెంబరు 2021

[dropcap]పా[/dropcap]ఠకులు విశేషంగా ఆదరణను అందిస్తున్నందుకు సంచిక ధన్యవాదాలు తెలుపుతోంది. పాఠకులను ఆకర్షించుకొని, వారు మెచ్చే రచనలను అందించాలని సంచిక తపన పడుతోంది. కోట్ల సంఖ్యలో తెలుగువారు ఉన్నా, పట్టుపని పది పత్రికలు లేకపోవడం తెలుగు భాష పట్ల అభిమానం కలవారందరూ ఆలోచించాల్సిన అంశం. ఎందుకని ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయో, కొనసాగుతున్నాయో విశ్లేషించి, పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

తన వంతుగా సంచిక ఈ నెల నుంచి ‘విశ్వవేదిక’ అన్న శీర్షికను ఆరంభిస్తోంది. ప్రపంచం నలుమూలలా విస్తరించి ఉన్న తెలుగు వారికి ఒక వేదిక నిస్తుందీ శీర్షిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తమ తమ అనుభవాలు, జీవన విధానాలు పంచుకునే వేదిక ఈ శీర్షిక. తమ సందేహాలు, సందిగ్ధాలు ఈ శీర్షిక ద్వారా ప్రకటించటం వల్ల ఒకరికొకరు పరిచయం అవటమే కాక, ప్రపంచంలో ఏ మూల ఉన్నా మన అందరి సంతోషాలు, బాధలు ఒకే స్వరూపం అని అర్థమవుతుంది. అది మనల్ని మరింత సన్నిహితులని చేస్తుంది.

ఈ శీర్షికను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన శ్రీ సారధి మోటమర్రి గారిని సంచిక అభినందిస్తునే, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. క్షణం తీరికలేని ఉద్యోగంలో ఉంటూ కూడా వారీ బాధ్యతను తలకెత్తుకోవటం తెలుగు భాష, సాహిత్యాల పట్ల వారి అభిమానాన్ని స్పష్టం చేస్తుంది.

ఇంకా పలు రకాల శీర్షికలు, రచనలతో పాఠకులకు ఆనందం కలిగించాలని సంచిక ప్రయత్నిస్తోంది.

1 సెప్టెంబరు 2021 తేదీన సంచికలో ప్రచురితమవుతున్న రచనల వివరాలివి

సంభాషణం:

ప్రత్యేక వ్యాసం:

కాలమ్స్:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

సినిమాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

రచనల ద్వారా, సలహాలు, సూచనల ద్వారా, ఇతర పాఠకులను పరిచయం చేయటం ద్వారా సంచికను మరింతగా పాఠకులకు చేరువచేసే వీలు కల్పించాలని అభ్యర్ధిస్తున్నది సంచిక.

– సంపాదక బృందం.

Exit mobile version