సంపాదకీయం సెప్టెంబరు 2018

3
2

ఈ సంవత్సరం ఉగాది నాడు అంటే మార్చ్ 18న సంచిక వెబ్ తీగలద్వారా ఇంటెర్నెట్ తెలుగు సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆరంభించినప్పటి నుంచీ పాఠకుల ఆదరణ లభించటం ఆనంద దాయకమే కాదు, ప్రోత్సాహకరము కూడా… ఇంకా వినూత్న శీర్షికలతో, రచనలతో పాఠకులకు ఆనందం కలిగిస్తూ, ఆలోచింపచేయాలన్న తపనను సంచిక టీంలో రగిలిస్తోంది పాఠకాదరణ.
సంచిక ఎంతో ఆశతో, ఉత్సాహంతో కథలు, కవితల పోటీలు ప్రకటించింది. కవితలు, కథల పోటీలకు సమయం వుంది కానీ, హాస్యకథల పోటీ సమయం అయిపోయింది. ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. హాస్యకథలకు అనుకున్న రీతిలో స్పందన రాలేదు. బహుశా అదే సమయానికి ఇతర పత్రికలు మరింత ఎక్కువ సొమ్ముతో పోటీలు నిర్వహిస్తూండటంతో రచయితలు ఆవైపుకు ఎక్కువగా ఆకర్షితులయినట్టున్నారు. హాస్యం సృజించటం అంత తేలికయిన విషయం కాకపోవటం కూడా అనుకున్న సంఖ్యలో కథలు అందకపోవటానికి కారణమయి వుండవచ్చు. అదీగాక, సంచిక ఇంకా కొత్త పత్రిక. ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తోంది. కాబట్టి, హాస్యకథలపోటీ గురించిన విషయం అందరివరకూ చేరివుండకపోయి వుండవచ్చు. అందుకని ఆశించినన్ని రచనలు అందలేదు. అందుకని సంచిక టీమ్ ఒక నిర్ణయం తీసుకుంది. పోటీకి వచ్చిన కథలు కొన్నే అయినా కథకులు ఎంతో ఉత్సాహంగా పోటీకి కథలు పంపారు. కాబట్టి, అన్ని కథలను ఉత్తమ కథలుగా నిర్ణయించి, పోటీకి కథలు పంపిన రచయితలందరికీ రూ.1000/- ప్రోత్సాహక బహుమతిగా అందచేయాలని సంచిక టీమ్ నిర్ణయించింది. కొందరు కథకులు ఒకటి కన్నా ఎక్కువ కథలు పంపారు. వారికి ఒక కథకే బహుమతి లభిస్తుంది. కథలు వారానికి రెండు చొప్పున త్వరలో సంచికలో ప్రచురితమవుతాయి. పాఠకులు వాటిని చదివి పోటీ కథలపై తమ అభిప్రాయాలను విమర్శనాత్మకంగా రాయొచ్చు. ఉత్తమ అభిప్రాయానికి బహుమతి వుంటుంది.
ఈనెల నుంచీ స్వాతి శ్రీపాద కన్నడం నుంచి అనువదించిన సీరియల్ “అంతరం” ఆరంభమవుతుంది. ఇది కూడా పాఠకాదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. త్వరలో యువ రచయిత వేటూరి ఆనంద్ రాసిన సీరియల్, బలభద్రపాత్రుని రమణి సంచిక కోసం ప్రత్యేకంగా రాసిన సీరియల్ ఆరంభమవుతాయి.
ప్రఖ్యాత కవి, సినీ గేయరచయిత భువనచంద్ర 17 ఏళ్ళ వయసులో తన హిమాలయ పర్యటనానుభవాలను ‘వాళ్ళు’ అనే శీర్షికతో పుస్తకంలా ప్రచురించారు. విశేషాదరణ పొందుతోంది ఆ పుస్తకం. అనేక ఆధ్యాత్మిక అంశాలను అతి సులువుగా వివరించిన ఆ పుస్తకానికి రెండవభాగం వంటి ఆలోచనాత్మకమయిన రచన వారు చేశారు. అది కూడా త్వరలో సంచికలో ధారావాహికగా వెలువడుతుంది. ఘండికోట బ్రహ్మాజీరావు గారి చివరి రచన అముద్రితము అయిన చరిత్రాత్మక నవల ‘శ్రీపర్వతం’ కూడా త్వరలో ఆరంభమవుతుంది.

సెప్టెంబరు 2018 సంచికలోని రచనలు:

సంపాదకీయం
ప్రధాన వ్యాసం: కైఫియత్తులు అందిస్తున్న చాటువుల్లో కొన్ని – కట్టా నరసింహులు
ధారావాహికలు:
నీలమత పురాణం -3 – కస్తూరి మురళీకృష్ణ
జీవన రమణీయం-22 – బలభద్రపాత్రుని రమణి
భూమి నుంచి ప్లూటో దాకా… – 14 – మధు చిత్తర్వు
తమసోమా జ్యోతిర్గమయ-2 – గంటి భానుమతి
అంతరం -1 – స్వాతీ శ్రీపాద
వ్యాసాలు:
గురజాడ కన్యాశుల్కంలో ఆంగ్ల సాహితీ సౌరభాలు – వేద ప్రభాస్
అన్యోన్య దాంపత్యానికి నిర్వచనం గురజాడవారి కాసులు – చెంగల్వ రామలక్ష్మి
తెలుగు వాకిట రంగవల్లి, రంగస్థలం – అత్తలూరి విజయ
ప్రకృతీ నీ ప్రకృతి – జియో లక్ష్మణ్

కథలు:
అకాల మేఘం – చావా శివకోటి
వానప్రస్థాశ్రమం – చల్లా సరోజినీ దేవి
ఆపరేషన్ సక్సెస్ – పేషంట్ డైడ్! – మాలాకుమార్
కథ విందువా – వాసవి పైడి
కవితలు:
కందములు – పంచభూతములు – బుసిరాజు లక్ష్మీ దేశాయి
సంస్కృత శ్లోకం – తెలుగు పద్యం-7 – పుప్పాల జగన్మోహనరావు
ఒంటరి తీరంలో నేను – బలభద్రపాత్రుని రమణి
నా అసలు నీడ – డా. విజయ్ కోగంటి
చైతన్యం – శ్రీధర్ చౌడారపు
ప్రయాణం:
అండమాన్ అనుభూతులు -3- ఎన్.వి. హనుమంతరావు
భక్తి పర్యటన:
గుంటూరు జిల్లా యాత్ర –7: పొన్నూరు – పి.యస్.యమ్. లక్ష్మి
కాలమ్స్:
ఆకాశవాణి పరిమళాలు-22 – డా. రేవూరు అనంతపద్మనాభ రావు
మానస సంచరరే – 4 – జె. శ్యామల
కల్పిక 12: దుఃఖలిపి – సలీం
రంగుల హేల 6 -పిసినారి పద్మలూ – దర్జా దమయంతులూ – అల్లూరి గౌరీ లక్ష్మి
కాజాల్లాంటి బాజాలు – 11- జి.ఎస్. లక్ష్మి
మనసులోని మనసా – 5 – మన్నెం శారద
బాలసంచిక:
నేటి సిద్ధార్థుడు – 6 – సమ్మెట ఉమాదేవి
పిల్లల రాజ్యం – పెయ్యేటి శ్రీదేవి
హనుమ సంక్షిప్త చరిత్ర – ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి
చిలకలు – శాఖమూరి శ్రీనివాస్
ధ్రువుని సంతతి – బెల్లంకొండ నాగేశ్వరరావు
భక్తి:
దివి నుంచి భువికి దిగిన దేవతలు -1- డా. ఎం. ప్రభావతి
అప్రస్తుత వర్ణకాలు – డా. వి. ఎ. కుమారస్వామి
సినిమాలు:
ప్రాంతీయ సినిమా 18: టాలీవుడ్ ఉత్థాన పతనాలు! – సికందర్

ఉత్కంఠ తక్కువ అసంతృప్తి యెక్కువ మిగిల్చిన “నీవెవరో” – పరేష్. ఎన్. దోషి

అవీ-ఇవీ:
మత్తు నుంచి బయటకు రావలసిన యువత – సమ్మెట విజయ
గుప్పిట్లో ఛందస్సు – పెయ్యేటి రంగారావు
పుస్తక పరిచయాలు:
నేహల
కథల గోదారి
కార్టూన్లు :
కెవి సుబ్రహ్మణ్యం
ఎమ్.ఎమ్.మురళి

సభలు:
డా. వేదగిరి రాంబాబుగారి సంస్మరణ సభ – ఘండికోట విశ్వనాధం

తెలుగు సాహిత్య ప్రపంచంలో కథల సంకలనాల విషయంలో నెలకొనివున్న పరిస్థితులను మెరుగుపరచేందుకు తనవంతుగా సంచిక కథల సంకలనాలను ప్రతి మూడు నాలుగు నెలలకొకటి ప్రచురించాలని సంకల్పించింది. తద్వారా తెలుగు కథ విస్తృతి, తెలుగు కథకుల ప్రతిభలను ప్రపంచమ్ముందు ప్రదర్శించి తెలుగుకథాప్రపంచాన్ని మరింత వైశాల్యం కలదిగా ఎదిగింపచేయాలని సంచిక ప్రయత్నిస్తోంది.
ఇంకా మరిన్ని సరికొత్త శీర్షికలు తెలుగు పాఠకులను అలరించేందుకు సంచిక ప్రచురించేందుకు సిద్ధమవుతోంది. సంచికపై మీ నిర్మోహమాటమయిన అభిప్రాయాలను, సలహాలను సూచలను అందచేయటం ద్వారా సంచికను మీకు మరింత చేరువగా చేయటంలో తమవంతు బాధ్యతను నిర్వహించవలసిందని పాఠకులకు, సాహిత్యాభిమానులకు మనవి.

– సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here