[dropcap]“ఈ[/dropcap] నడమ మననోళ్లంద్రు ఇంగిలీసు సదువులు సదవతారు ఏలనా?”
“ఇంగిలీసోని మాద్రిగా బతికేకిరా”
“అదెట్ల బతుకునా వానిది”
“యంత్రాల బతుకు, తంత్రాల బతుకురా”
“మడి, మనదినా”
“ప్రకృతి సహజమైన బతుకు, పండగలా బతుకురా”
“మన బతుకుని గురించి చెప్పేకి మనకి సదువులు లేదానా?”
“లేకేంరా, కూలోని కష్టం, రైతు చెమట, నేసేవాని (చేసేత) పనితనం
చెప్పులుకుట్టేవాని నేర్పు ఇట్ల అన్నీ అన్నీ సదువులేరా”
“ఇవన్ని పనులు కదనా? సదువు లెట్లా అవుతాయి?”
“ఎట్లయితాయా, ఇంగిలీసు సదువులు సదివేది ఏమిటికిరా”
“పని చేసేకినా, అదే మంచి ఉద్యోగం చేసేకినా”
“కదా, సదువెట్ల పని అయిందో ఇబుడు తెలిసినా?”
“ఊనా”
“కానీరా, నీపని కానీరా ప్రపంచానికే పాఠాలు చెప్పిన
కళాచారం మనది. నీపని కానీరా”
ఈ నడమ = ఇటీవల