ఈ ఉదయం…

0
1

[dropcap]గా[/dropcap]లి పిలుస్తున్నట్లు
పూవు పలకరించినట్లు
పుప్పొడి పులకరించినట్లు
నను చుట్టుకు తిరిగి పోయిన
ఆ సీతాకోకచిలుక ఎక్కడికెళ్ళినట్లు…

కొండలు దాటి
కోనలు దాటి
ఈ అమానుష నగరంలోకి
వచ్చేశాక కూడా
తన రెక్కలమీది మంచు బిందువులెందుకు
నాపై చిలకరిస్తున్నట్లు…

ఏ వ్యక్తావ్యక్త భావనలలోనో
దాగిన అచంచలస్వప్నాన్నింకా
ఎందుకు ప్రేమతో స్పృశిస్తున్నట్లు…

నవీన భావనల మేఘచ్ఛాయనేదో
నాపైకే మోహరించినట్లు
దిగంతాలకావలి వర్ణవలయాలను
నా దోసిట ఆనంద సింధువు గా
ఎందుకు పొంగిస్తున్నట్లు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here