[dropcap]వి[/dropcap]ళంబికి వీడ్కోలు ‘వికారి’కి స్వాగతం
ప్రకృతి మాత తన బిడ్దలకిచ్చే అక్షయపాత్ర
మన సంస్కృతి ఆచార వ్యవహారాలు శోభిల్లడానికి ఉగాది ఓ పునాది.
తెలుగువారి వెలుగుల జాబిల్లి ప్రథమ పండుగ
షడ్రుచులను సేవించడంలో ‘ఔషధ’పాత్రుందని సూచన.
‘ఆమని’ కనిపించిన కాలం ఈ వసంతకాలం
భాషలకు భావాలకు పుట్టినిల్లు మన ప్రాంతం
తొలి భాష తొలి పండగ మనది అదే ఉగాది.
ప్రకృతి శిక్షణలో హార్ష ధర్మంలో సనాతన ధర్మంలో కనిపిస్తుంది
ప్రకృతి సోయగాలతొ ఆటపాటల సవ్వడిల నేస్తం
అవినీతికి అడ్డు నీతికి లడ్డు
ప్రకృతి మన కళామతల్లి వరప్రసాదం
మన ప్రాంతం మన భాష మన సొత్తు
సంగీత సాహిత్యా పరిమళాలకు మన భాష అంకురము
పరివర్తన తెచ్చే కాలం ఈ వసంతకాలం
మన సంస్కృతికి నీరాజనాలు.
ఈ రోజు వాన జల్లులో సాహిత్య సంగీత కవుల జల్లులు కూడా
మనజాతి గౌరవం మన సంస్కృతి రక్షణకు పాటుపడదాం
తెలుగు సత్తా చాటుదాం, వెలుగు బాటలో నడుద్దాం.
తీపి కబుర్లు తీపి నేపథ్యలో తాపీగా సాఫీగా గడుపుదాం.