[dropcap]చి[/dropcap]న్నప్పటినుండి ఒకే కంచములో తిని
ఒకే మంచములో పడుకొన్నట్లు ఉండే
నా స్నేహితుడు గిరీశ్ అమాంతముగా
మా యింటికి వచ్చి నాతో
“రంగా నీవొకటి తప్పక నాకివ్వా” లని చెప్పగా,
“మన మధ్య అడగడాలా”అని నేను చెప్పి
“రాగిణీ, గిరీశ్కు ఏమో కావాలంటున్నా” డని
“నువ్వు అడగ” మని నేననగా,
వాడు వంటగదిలో ఉన్న రాగిణివద్దకు వెళ్లి
ఏమో కొంతసేపు మాట్లాడి,
ఆమెతో బయటికి వచ్చి నాముందు నిలబడి
“రంగా, మాట తప్పే” వని చెప్పగా
“తప్ప” నని నేననగా
“మేమిద్దరము కొంతకాలముగా ప్రేమించుకొన్నా” మని
“రాగిణిని నాకు ఇవ్వా” లని చెప్పగా
భారతములోని ద్రౌపదితో ఇంటికి వచ్చి
కుంతితో “నేనొక వస్తువు తెచ్చా” నని చెప్పగా
“మీరైదుగురు పంచుకొనండని” ఆమె చెప్పిన
వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ
నిర్ఘాంతపడి నిలిచిపోయాను…