[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఏకాంతంలో ఎంతో ఉంది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]ఏ[/dropcap]కాంతంలో ఎంతో అందం వుంది
ఏ కాంతలో లేని సొగసుంది
మనసుని నస పెడుతుంది
వయసుకి సెగ పుడుతుంది
రేపెట్టే ఆశలు చలిపెట్టే వూసులు
నేల మీద నిలవని కాళ్ళు
నింగిని తాకే యవ్వన పరవళ్ళు
మోహానికి తోరణాలు
మౌనాలకు స్వాగతాలు
ఇవన్నీ ఏకాంత కాంత చేసే
అసలు సిసలు విన్యాసాలు
అందుకే ఎంత కాదనుకున్నా
ఏకాంతానికి దాసోహం అనాల్సిందే