[dropcap]రో[/dropcap]జు పరిగెత్తే ఇష్టాన్ని
ఏ తాళ్లతో కట్టి బంధించను?
రోజూ అలవాటపడ్డ రుచిని
ఏ మందుతో అరికట్టను?
ఏది దాచనితనాన్ని
ఏ గుట్టుతో పూడ్చను?
ఎప్పుడు కనే కలను
ఏ మెలుకువతో ఆపను?
ఎప్పుడో నాటుకున్న ప్రేమను
ఏ పరికరంతో తవ్వను?
ఏమి చెయ్యాలో తెలియని నేను
నీదే బాద్యతని ఎలా చెప్పను?