[dropcap]”మ[/dropcap]గోళ్ల మాదిరినే ఆడోళ్లకి సమాన హక్కులు వుండాలా” ఓ జెండా పార్టీ అన్న అనె.
“అన్న చెప్పింది నిజమే. సమాన హక్కులు వుండాలా” అంట్ని.
“మగోళ్లకి సమానంగా ఆడోళ్లకి అవకాశాలు అన్ని రంగాలలో ఇయ్యాల” ఇంగో అన్న కిర్లే.
నేను అన్న కిర్లుకి జై కొడితిని.
“మగ… ఆడ… ఇద్దరూ ఒగటే” ఇంగో అన్న ఇరివిగా అనె…
“ఇద్రు ఒగటినా అదెట్ల” అట్లే తగులుకొంట్ని.
“అదెట్ల కాదో నువ్వే చెప్పు” అని నాకే మంట పెట్టె అన్న.
“అట్లంటావు ఏమినా? ఈ ప్రకృతిలా మగోని ముఖ్యత్వం మగోనిది, ఆడోళ్ల ముఖ్యత్వం ఆడోళ్లది. అది శరీరంలా మొదలై, చేసే పనుల్లా కూడా వుంది. అదీ కాకుండా బిడ్డల్ని కనడం అనేది ఆడోళ్లకి ప్రకృతి ఇచ్చిన పెద్ద బాద్యత. దాన్నింకా ఇద్దరూ ఇద్దరే కాని ఒగరు కాదు” అంట్ని.
“ఓ… అవునుదా” అని అందాజు చేస్తా అన్న ఎల్లీశా.
***
ఎల్లీశా = వెళ్లిపోయ