[మాయా ఏంజిలో రచించిన ‘They ask why’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(కొన్ని తలపుల తలపోతగా ఈ కవితను చూడవచ్చు!)
~
[dropcap]నా[/dropcap]వంటి పెద్ద ధృఢమైన అమ్మాయి
సాధారణ వేతనం వచ్చే
ఏదో ఒక ఉద్యోగం ఎందుకు చేయడం లేదోనని
ఒకానొక వ్యక్తి
తెగ ఆశ్చర్యపడతారు
నేనామెను నడిపించడానికి
ఆమె గురించి అధ్యయనం చేసేందుకు
నా సమయాన్ని వెచ్చించాను
నిమ్న ప్రజలు కూడా
కనీస వేతనంతో బ్రతకలేరు
నేను నీ కోసం వారం అంతా
ఎందుకు వేచి ఉంటానోనని
ఆ నిర్దిష్ట వ్యక్తి
ఆశ్చర్యపోయారు
నువు చేసే పనిని
వివరించేందుకు నా వద్ద మాటలు లేవు
నీ నడకలో సముద్రపు చలనం చైతన్యం
ఉన్నదని చెప్పాను నేను
ఇంకా..
నా చిక్కు ప్రశ్నలని విడదీసినప్పుడు
మీకు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదని!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ