[dropcap]మ[/dropcap]హాత్మా మహర్షి
ప్రాతః స్మరణీయ మూర్తి
మానవుడిగా పుట్టి
ఎంత ఉన్నతంగా
జీవించవచ్చో నిరూపించిన
ఆదర్శమూర్తీ
నా జీవితమే నా సందేశం
అని చెప్పిన ఘన త్యాగమూర్తీ
వందనం
నీలా జీవించడం కష్టమని
ఆ ఛాయలకే పోకుండా
నిజాయితీ లేని నేతలు
దేశనాయకులు
పదవుల కోసం కేకలు
సహనం లేని కాకులు
ఎన్నికలలో నోట్లు జల్లి
పదవులు కొనుక్కునే బాకులు
వాగ్దానాల అవ్వాకులు చెవ్వాకులు
చెప్పి అధికారం దక్కించుకున్న
అహంకార చాకులు
అన్యాయం అక్రమాలు
ఆచరించే నేతలు
ఏమీ చేయలేని నిర్భాగ్య ప్రజలు
తిరగబడే రోజులు
ఉరుకుల పరుగులతో
వస్తున్నయ్ వస్తున్నయ్
దేశక్షేమం కాంక్షించే నాయకుల
ఎన్నికల కోసం.