Site icon Sanchika

“ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు” – సరికొత్త ధారావాహిక – ప్రకటన

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి….

“ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు” – సరికొత్త ధారావాహిక

***

అన్నీ తెలిసినట్లే ఉంటుంది. కానీ చేసే తప్పులు చేస్తూనే ఉంటాం.

ప్రతీ తప్పు వెనక ఓ కారణాన్ని సృష్టించుకుంటాం. 

కొన్నాళ్ళకి అదే ఓ అవసరంగా తయారయిపోతుంది.

అప్పటికే జరగాల్సిన నష్టం ఏదో జరిగి పోతుంది. 

కళ్ళు తెరుచుకుంటాయి.

అయితే వాస్తవం అనే వెలుగుని ఎక్కువ సేపు చూడలేక మళ్ళీ కళ్ళు మూసుకుపోతాయి.

ఇదే జరిగింది బ్రహ్మాజీ విషయంలో.

దుబాయ్ ఏర్పోర్ట్ లో శివరామ్‌ని, బ్రహ్మాజీ గుర్తు పడతాడు.

నలభైమూడేళ్ళ తరువాత కనిపించిన శివరామ్ ఒక్కడే తనలో ఉన్న ప్రశ్నలకీ జవాబులు ఇవ్వగలడు.

ఒకటా రెండా,ఎన్నో ప్రశ్నలు.

శివరాంని సంధించాల్సిన ప్రశ్నలు.

ఆ ప్రశ్నలకు ఒకప్పుడు ఎంతో బలం ఉంది. కోపం ఉంది. ఆవేశం ఉంది. ఆవేదన ఉంది. ఆక్రోశం ఉంది. ఎదురుగా ఉంటే ఏదైనా చేయాలన్న ఆలోచన కూడా ఉంది.

కానీ అవి అన్నీ నలభై మూడేళ్ళ క్రితం.

కాలంతో పాటు ఆ ప్రశ్నలకు ఒకప్పుడు ఉన్న బలం లేదు.

అన్నీ బలహీన పడిపోయాయి.

కానీ ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిన మనిషి ఎదురుగా కనిపించడంతో, తన ఎస్టేట్‌కి తీసుకెళ్ళి అడుగుతాడు.

వాళ్లిద్దరు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. మరణం ఒక్కటే తమని వేరు చేయగలదనుకుంటారు. కానీ కాదు. ఇద్దరు శత్రువుల్లా వాదించుకుంటారు. పాత సంఘటనలు అన్నీ వాళ్ల మధ్య వస్తాయి.

అడగాల్సిన వన్నీ బ్రహ్మాజీ అడిగేస్తాడు.

శివరామ్ జవాబులు….

***

త్వరలో ప్రారంభం…

Exit mobile version