[కైఫీ అజ్మీ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Kaifi Azmi’s poem by Mrs. Geetanjali.]
~
[dropcap]ఏ[/dropcap]మనుకుంటున్నావు నన్ను?
నేనొక దేశాన్నో.. ఒకరి ఆస్తినో కాదు నువ్వు కాల్చేయడానికి.
నిలువెత్తు గోడనీ కాదు కూల్చి వేయడానికి
కనీసం సరిహద్దుని కూడా కాదు చెరిపివేయడానికి.
నువ్వేదో ఈ బల్ల మీద పెట్టిన
భూగోళపు మ్యాప్ లో చూపిస్తున్నావు చూడూ..
అవి వొట్టి పిచ్చి గీతలు.
దీన్లో నువ్వు నన్నెక్కడని వెతుకుతావు చెప్పు?
నేను ఒక మనిషిని కాను.. ఆకాంక్షని..
దేశం నిండా ఉన్న మనుషుల ఆశని.. స్వప్నాన్ని!
నేను మరణించను..
నన్ను మరణించనివ్వను!
నన్ను నువ్వు ఏమీ చేయలేవు..
నిజంగా ఎంత అమాయకుడివి నువ్వు?
~
మూలం: కైఫీ అజ్మీ
అనుసృజన: గీతాంజలి