Site icon Sanchika

యెర్ర గులాబీ!

యెర్ర గులాబీ తీసుకుని
ఒక్కో రెక్క విప్పి
నీ మంత్రమే చదువుతూ
నువ్వొస్తావా రావా అని
చిన్న కొండ మీద, ఊరవతల చెట్టుకింద
కూసుని ఎదురుసూస్తుంటే

బీజం మొక్కగా మారినప్పుడే
మన ప్రేమని కోరాయి

చెట్టు నుంచి పూవుని కోసినప్పుడే
మన నవ్వుల్నీ కోరాయి

పూ రెక్కలు విడిపోతూ
మన సంగమాన్ని కోరాయి

ప్రతి అణువు మనం కలవక ముందే
మన కలయిక కోరాయి

చివరి రెక్క తుంచక ముందే
నీ నీడ నా మీద వాలింది

నా చేతిలో ఉన్న మొగ్గ
రేగడి మన్నులో పదిలంగా ఒదిగింది

నీ నా ప్రేమ శాశ్వతం
ఆ పూవుకి దొరికింది మరో జీవితం !

Exit mobile version