[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]
Zurich Lindt chocolate factory
బసెల్ railway station నుండీ అందరం జూరిచ్‌కి వెళ్ళాము. గంటకు పైగా ప్రయాణం అందంగా సాగింది. స్టేషన్ బైటికి వచ్చి కొద్దిదూరంలో ఉన్న బస్టాప్‍లో పబ్లిక్ transport bus లో దాదాపు 35 నిమిషాల ప్రయాణం తరువాత చాకొలేట్ ఫ్యాక్టరీ స్టాప్ చేరాము.
ఫ్యాక్టరీ వైపు నడుస్తుంటే ఇటు రండి అని పిలుస్తున్నట్లు గాలిలో తియ్యనైన చాకొలేట్ సువాసనలు. పెద్ద భవనాలు. లోపలికి ఎంటర్ అవగానే భవనం పైకప్పును తాకుతున్నట్లున్న పెద్ద చాకొలేట్ ఫౌంటెన్. బొమ్మ కాదు. నిజమైనది.
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని లిండ్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక అద్భుత ప్రదేశం. నగరం నడిబొడ్డున ఉన్న ఈ కర్మాగారం 1845 నుండి స్విస్ సంస్కృతిలో ప్రధానమైనది, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
టూరిస్ట్, మాస్టర్ చాక్లేటియర్‌లు తమ రుచికరమైన మరియు ప్రత్యేకమైన సృష్టిని రూపొందించడాన్ని చూడవచ్చు. పర్యటన సాగుతున్నప్పుడు, సందర్శకులు లిండ్ట్ కుటుంబం యొక్క కథను మరియు వారి చాక్లెట్ తయారీ ప్రక్రియను తెలుసుకుంటారు.
పెద్ద చాకొలేట్ sales ఏరియా. Refreshments ఏరియా. మేము reception కి వెళ్లి ముందుగానే బుక్ చేసిన టికెట్స్ కన్ఫర్మేషన్ మెయిల్ చూపించాను. వాళ్ళు మమ్మల్ని ప్యాక్టరీ టూర్ బృందంతో కలిపి లోపలికి తీసుకెళ్లారు. ముందుగా అందరికీ ఆడియో equipment ఒకటీ ఇచ్చారు, మనకి తెలిసిన భాషలో చాకొలేట్ చరిత్ర వివరాలు విని తెలుసుకోవటానికి.
లోపల చాకొలేట్ ఎప్పుడు ఎలా ఎక్కడ తయారయింది, ఎవరు కనుక్కున్నారు, ముడి సరుకు కోకో ఎక్కడ ఏ దేశాల్లో పండుతుంది, ఎలా దాన్నుండి చాకొలేట్ తయారు అవుతుంది లాంటి అనేక విషయాలు చెప్పి ఫోటోలను ప్రదర్శించారు.
తయారీ ప్రదేశంలో వివిధ దశల్లో తయారవుతున్న చాక్లెట్స్ చూసాము. రుచి చూడటానికి వీలుంది. వివిధ రుచుల్లో ఉన్న ముడి చాకొలేట్‌ని తిన్నాము. చివరగా బైటికి వస్తుంటే అనేక రకాల చాక్లెట్స్ ప్యాకింగ్ అయినవి సందర్శకుల కోసం ఉచితంగా పెట్టారు. ఎలాంటి అభ్యంతరాలు లేవు వాటిని తీసుకోవటానికి.
అందరూ కావల్సినన్ని తీసుకున్నాము. ఇతరులు ఒకటి రెండు మాత్రం తీసుకుంటే మనం అతిగా తీసుకుని ఫూల్ అవలేము కదా. ఒక ఫోటో బూత్ ఉంది.
తరువాత అందరం sales area కి వచ్చి నచ్చిన వివిధ రకాల చాక్లెట్స్ కొనుక్కున్నారు.
అదొక తియ్యనైన అనుభవం. అంతేకాదు చాకొలేట్ పూర్వాపరాలు తెలుసుకున్నాము.
ఆ వివరాలు మీ కోసం:
రుచికరమైన చాక్లెట్‌కు స్విట్జర్లాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశం యొక్క అత్యంత ప్రియమైన చాక్లెట్ బ్రాండ్‌లలో ఒకటి లిండ్ట్, ఇది 1845 నుండి అధిక-నాణ్యత చాక్లెట్‌ను రూపొందిస్తోంది.
లిండ్ట్ యొక్క ఉత్పత్తులు ఇప్పుడు ఐరోపా (స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా), USA, UK లోని పదకొండు స్వంత ఫ్యాక్టరీలలో తయారు చేయబడతాయి.
Lindt & Spangle 1845లో స్విస్ చాక్లెట్‌గా స్థాపించబడిన కంపెనీ. 1937లో ప్రారంభమైనప్పటి నుండి, కంపెనీ ప్రపంచంలోని అత్యంత ప్రియమైన చాక్లెట్ బ్రాండ్‌లలో ఒకటిగా ఎదిగింది, డేవిడ్ స్ప్రంగ్లీ-స్క్వార్జ్ మరియు అతని కుమారుడు రుడాల్ఫ్ స్ప్రింగ్లీ-అమ్మన్ అందుకు కారకులు.
19వ శతాబ్దం ప్రారంభంలో పశ్చిమ స్విట్జర్లాండ్‌లో మొదటి యాంత్రిక చాక్లెట్ ఫ్యాక్టరీలను చూసింది. ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఫ్రాంకోయిస్-లూయిస్ కైల్లర్ , ఫిలిప్ సుచార్డ్ మరియు చార్లెస్-అమెడీ కోహ్లెర్ ఉన్నారు.చాలా పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీలు 19వ మరియు 20వ శతాబ్దాల ప్రారంభంలో స్థాపించబడ్డాయి.
స్విస్ చాక్లెట్‌లు అత్యధిక నాణ్యత గల మెటీరియల్‌లను ఉపయోగిస్తాయి, వారి చాక్లెట్స్ నీ ఉత్పత్తి చేయడానికి జ్యూరిచ్ సమీపంలోని కిల్చ్‌బర్గ్ ఫ్యాక్టరీలోని అత్యుత్తమ పద్ధతుల్లో తయారవుతాయి.
ప్రతి సంవత్సరం సుమారు 5 మిలియన్ టన్నుల కోకోను పండిస్తారు. రెండు అతిపెద్ద ఉత్పత్తి దేశాలు కోట్ డి ఐవోర్ మరియు ఘనా, అంటే ప్రపంచంలోని కోకో ఉత్పత్తిలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ పశ్చిమ ఆఫ్రికా వాటాను కలిగి ఉంది.
కోకో బీన్స్ కోకోఫ్రూట్ లోపల పండిస్తారు. పసుపు లేదా ఆకుపచ్చ కాయలు ఆకులతో కూడిన కోకో చెట్ల కొమ్మలు మరియు ట్రంక్‌లపై పెరుగుతాయి. చిన్న కోకో పొలాల్లో పెంచుతారు. కోకో గింజలను పండించడం, కోయడం, పులియబెట్టడం మరియు ఎండబెట్టడం వంటి మాన్యువల్ పనిని చేస్తూ ఘనా మరియు కోట్ డి ఐవోర్‌లలో 2 మిలియన్ల చిన్న కోకో రైతులు ఉన్నారని అంచనా. అత్యధిక మంది రైతులు అత్యంత పేదరికంలో ఉన్నారట.
కోట్ డి ఐవోయిర్ మరియు ఘనాలో దాదాపు 1.6 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారని అంచనా వేయబడింది, వీరంతా కుటుంబ కోకో పొలాల్లోనే పనిచేస్తారు.
అటవీ నిర్మూలన – కొంతమంది రైతులు పర్యావరణాన్ని రక్షించే విధంగా కోకోను పండించేటప్పుడు ఎక్కువ ఉత్పాదకత కలిగిన రక్షిత ప్రాంతాలను ఆక్రమించి అడవుల నష్టానికి కారణం అవుతున్నారట.
వాతావరణ మార్పు – అటవీ నిర్మూలన కోకోను వాతావరణ మార్పులకు కారణం చేస్తోంది.అందువల్ల ఉత్పత్తి, ఆదాయాలు తగ్గే ప్రమాదం ఉంది.
ఇవండీ ప్రపంచ అంతటికీ చాలా ఇష్టమయిన చాకొలేట్ పూర్వాపరాలు.
చాకొలేట్ పై కాగితం తీస్తూ తింటూ అదెక్కడినుండి ఎన్ని చేతులు మారి మన నోట్లోకి ఎలా వచ్చిందో గుర్తు చేసుకుందామా?
Photos: Mr. D. Nagarjuna
(వచ్చే వారం కలుద్దాం)