యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-12

0
2

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

జంగ్‌ఫ్రాజోచ్‌

Swiss travel లో చివరి మజిలీ జంగ్‌ఫ్రాజోచ్‌ (Jungfraujoch). మనం సాధారణంగా అనేక ఇండియన్ మూవీస్‌లో సాంగ్స్‌లో చూసిన దృశ్యకావ్య సమాహారం ఇది. మేము Basel లో మా ప్రయాణానికి కావాల్సిన సమాచారం సేకరించి, ట్రావెల్ టికెట్స్ కొనుక్కొని ట్రైన్‌లో journey start చేసాము.

జంగ్‌ఫ్రాజోచ్ సముద్ర మట్టానికి 3454 మీటర్ల ఎత్తులో ఐరోపాలో ఎత్తైన రైలు స్టేషన్. ఇది స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ జంగ్‌ఫ్రాజోచ్‌ పర్వత శ్రేణిలో ఉంది. జంగ్‌ఫ్రావ్ (Jungfrau) అనేది 13,642 అడుగుల ఎత్తులో ఉన్న స్విస్ శిఖరం.

ఇది లాటర్‌బ్రున్నెన్ వ్యాలీలో ప్రముఖమైన పర్యాటక కేంద్రం మరియు ఇంటర్‌లేకెన్ రిసార్ట్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 11 మైళ్ల దూరంలో ఉంది. ఈ రైలు స్టేషన్ చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి లాటర్‌బ్రున్నెన్ ద్వారా మరియు మరొకటి గ్రిండెల్‌వాల్డ్ ద్వారా.

మేము గ్రిండెల్‌వాల్డ్ స్టేషన్ నుండి వెళ్ళాము.

మా రైలు ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. పచ్చని ప్రకృతి మధ్యలోంచి ముందుకు వేగంగా దూసుకెళ్లిన రైలు. అడవులు,పచ్చిక మైదానాలు,అందమైన గ్రామాలు ఇళ్ళు.

ఇంకొంచం ప్రయాణం తరువాత నేలమీద ముగ్గులా తెల్లగా పరుచుకున్న మంచు. అందమైన దృశ్యం. కళ్ళు తిప్పుకోకుండా ఉండిపోయాము. నిశ్శబ్దంగా అందమైన పరిసరాలను చూస్తూంటే ఏదో తెలియని భావుకత. మేము దిగాల్సిన స్టేషన్ వచ్చింది.

అక్కడ నుండి అబ్జర్వేటరీకి కేబుల్ car లో పైకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ట్రైన్‌లో రావచ్చని చెప్పారు టికెట్ కౌంటర్‌లో. సరేనని టికెట్స్ కొన్నాము.మా మొత్తం ట్రిప్‌లో అత్యంత ఖరీదైన ట్రిప్ ఇదే. దాదాపు 50వేల రూపాయలు. వద్దులే అనుకున్నాము. కానీ మా అమ్మాయి ఇంత దూరం వచ్చి ఒక అద్భుతమైన ప్రదేశం చూడటానికి ఆలోచన వద్దు అనటంతో అని ముందుకే సాగము. మళ్ళీ మళ్ళీ వెళ్లలేని ట్రిప్స్ కదా.

కేబుల్ కార్‌లో చాలా మంది స్కీయింగ్ పరికరాలతో ఉన్నారు.

ఆకాశం మా హద్దు అన్నట్లున్న వృక్షాలు తెల్లగా పరుచుకుని కళ్ళు చెదిరే తెల్లని స్నో లో దూరంగా స్కీయింగ్ చేస్తూ బొమ్మల్లా కదులుతున్న మనుషుల్ని చూస్తూ ఎత్తైన శిఖరం మీదకు వెళ్ళాము. మాటలు దొరకని అనుభూతి.

అక్కడ నుండి సొరంగ మార్గం లోకి పయనం.

ఐస్‌తో నిండి ఉన్న దారి. పడిపోకుండా గోడలకి ఫిక్స్ చేసిన రైలింగ్స్ పట్టుకుని నడుస్తూ వెళ్ళాము. దోవలో ఆ మార్గం గతంలో ఎలా ఉండేది, ఎవరు దాన్ని ఎప్పుడు ఎలా ఆధునికీకరించారని చెప్పే వివరాలు ఫొటోస్ ఉన్నాయి. అంతే కాదు ఐస్‌తో చేసిన musical Instruments, interview cabin లాంటివి కనపడ్డాయి.

మేము మా ఫైనల్ మజిలీకి లిఫ్ట్‌లో వెళ్ళాము. విపరీతమైన చలి గాలులు.-18 డిగ్రీల ఉష్ణోగ్రత.

ఫ్రీజ్ అవుటమేమో అనిపించే దాకా డెక్ మీదే ఉండి స్నో పరిసరాలు ఎంజాయ్ చేసాము. తరువాత నెక్స్ట్ లెవెల్ కిందకి వచ్చి అక్కడున్న Swiss hotel లో స్విస్ లోకల్ ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాము. వేడి వేడి melted cheese లో dip చేసుకుని తిన్న bread వంటకం చాలా బాగుంది.

అక్కడ Swiss చాక్లెట్స్,watches అమ్మే షాప్స్ ఉన్నాయి.

అక్కడ నుండి ఇంకో లెవెల్ దిగి స్కీయింగ్ ఏరియాకి వచ్చాము. అక్కడ మెత్తని స్నో మీద నడిచాము. మంచు మీద నడుస్తుంటే మన పక్కనుండి వేగంగా వంపులు తిరుగుతూ స్కీయింగ్ చేస్తూ వెళ్తున్న వారిని చూసి గాభరా పడ్డాను. వారి అడ్డంగా వస్తే తగిలి కిందపడితే ఎలా అని. వాళ్ళు చాలా జాగ్రత్తగా మనని తగలకుండా వెళ్తారు.

అక్కడనుండి వెనక్కి మేము mountain train లో వచ్చాము. ట్రైన్ దిగాక స్నో లో స్లెడ్జ్ చేస్తానని మా మనమరాలు ముచ్చటపడితే అక్కడ అద్దెకి ఇస్తే కిడ్స్ సైజ్ sledge తీసుకుని వారి సూచన ప్రకారం sledge ఎత్తునుండి కిందకు పుష్ చేస్తూ వచ్చి కేరింతలు కొట్టింది పరి. నేల మీద పరుచుకున్న మంచుతో స్నో మాన్ బొమ్మను చేసి చాలా ఆనందపడింది పరి.

చివరి ట్రైన్ to our stay Basel కి ఎక్కి sunset లో బంగారు రంగులో మెరుస్తున్న పరిసరాలు మంచు సూర్యుణ్ణి చూస్తూ సైలెంట్ గా దృశ్యాలను మనస్సులో ముద్రించుకున్నాము.

అదొక ధ్యానంలా ప్రశాంతంగా అనిపించింది.

జంగ్‌ఫ్రాజోచ్ రైల్వే స్టేషన్ యొక్క అబ్జర్వేటరీ 3571 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని సింహిక అబ్జర్వేటరీ అంటారు.

మీరు లిఫ్ట్ ద్వారా ఈ అబ్జర్వేటరీకి చేరుకోవచ్చు. ఇది టెర్రస్ నుండి మరియు భవనం లోపల నుండి కూడా 360° వీక్షణను అందిస్తుంది.

ఇది ఐస్ ప్యాలెస్‌కు నిలయం. ఈ ఐస్ ప్యాలెస్ అనేక అద్భుతమైన మంచు శిల్పాలను కలిగి ఉంది.

ఆల్పైన్ సెన్సేషన్ అని పిలువబడే చిత్రాలు, కాంతి మరియు సంగీతంతో కదిలే నడక మార్గం ఉంది. ఇది సింహిక అబ్జర్వేటరీ క్రింద ఉన్న హాల్‌ను ఐస్ ప్యాలెస్‌కి కలుపుతుంది.

జంగ్‌ఫ్రావ్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తి JR మేయర్. అతను ఆగష్టు 3, 1811 న చేసాడు.

ఈ 3,885 అడుగుల ఎత్తైన అధిరోహణ యొక్క ప్రారంభ స్థానం మోంచ్‌జోచ్ హట్ మరియు చివరి పాయింట్‌కి ప్రయాణం చాలా గంటలు పడుతుంది.

ఈ పర్వత శ్రేణి ఐరోపాలో అతిపెద్ద హిమానీనదం అయిన అలెట్స్చ్ గ్లేసియర్‌కు నిలయం మరియు 2001 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో జాబితా చేర్చబడిందిట.

జంగ్‌ఫ్రాజోచ్‌ మరియు క్లీన్ స్కీడెగ్ మధ్య 9.2 కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌ను రైల్వే ఉద్యోగి ప్రతి వారం కాలినడకన తనిఖీ చేస్తారట.

ఎంతో శుభ్రంగా ఉన్నాయి పరిసరాలు. మరపురాని అనుభూతి.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here