యూరప్ పర్యటనలో అందాలూ అనుభవాలూ ఆనందాలూ-2

0
2

[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]

పారిస్ – ఈఫిల్ టవర్

[dropcap]యూ[/dropcap]రోప్ యాత్రలో ప్యారిస్ సందర్శనంలో రెండవది ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్.

పారిస్‌లో ఎక్కువగా టూరిస్ట్‌లు వచ్చేది ఇక్కడికే. ఒకప్పుడు ప్రపంచం లోనే ఎత్తైన కట్టడం. యూరోపియన్ దేశాల్లో మేము చూసిన వాటిల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ చాలా బావుంటుంది. అందువల్ల వీలైనంతవరకు వాటిల్లోనే తిరిగాము.

లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌లో అక్కడికి చేరుకున్నాము. టికెట్ కౌంటర్స్ దగ్గర ఎంతోమంది నుంచున్నారు.

మా అమ్మాయి వాళ్ళు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసారు. సో లైన్‌లో నుంచునే టెన్షన్ లేదు. అంతకు ముందు మూడేళ్ళ క్రితం నేను, మా అమ్మాయి వచ్చినప్పుడు టికెట్స్ కోసం గంటకు పైగా వెయిట్ చేసాము. అప్పుడు మా చిన్నారి పరికి ప్రామిస్ చేసింది నెక్స్ట్ టైం Europe లో ఆఫీస్ పనిపడితే తప్పక ఈఫిల్ టవర్ చూపిస్తా అని.

“అమ్మమ్మా! Peppa Pig లో ఈఫిల్ టవర్ చూసాను. లిఫ్ట్‌లో పైకి వెళ్ళాలి. సిటీ మొత్తం కనిపిస్తుంది. సెకండ్ ఫ్లోర్‌లో వ్యూ పాయింట్స్ ఉన్నాయి. రెఫ్రెషమెంట్స్ దొరుకుతాయి” అంటూ ఒకటే కబుర్లు చెప్పింది ఏడేళ్ళ పరి. ‘Wow నీ వయస్సులో నాకేమి తెలియదు’ అనుకున్నాను. ఇప్పటి తరం రాకెట్ స్పీడ్.

ఆన్‌లైన్‌లో టికెట్స్ కొన్నవారి లైన్‌లో ముందుకు వెళ్ళాము. మా టికెట్స్, బాగ్స్ చెక్ చేసారు. స్కానింగ్. లిఫ్ట్ ఎక్కే లోపల ఇంకోసారి చెకింగ్. పెద్ద లిఫ్ట్స్ ఉన్నాయి. మా వంతు కోసం ఎదురు చూస్తూ నుంచున్నాము. పరి ఎక్సయిట్మెంట్ పీక్స్‌లో ఉంది.

లిఫ్ట్ లో ఎక్కి పైకి వెళ్తూ నైట్ లైట్స్ లో పారిస్ నగరం అందం చూస్తూ భలేవుంది అనుకున్నాము. లిఫ్ట్ దిగాక చుటూ తిరిగి చూసాము. విపరీతమైన చలి, చల్లని గాలులు. దానికి తోడు ఎత్తులోంచి దీపకాంతులతో నగరం. అదొక అద్భుతమైన ఫీలింగ్.

నైట్‌లో ప్రతి గంటకి 5 నిముషాలకి రంగురంగుల లైట్స్ వెలిగి ఆరిపోతాయి. అక్కడొక Penny మెషిన్ ఉంది అందులో కాయిన్ పెట్టి తిప్పితే బొమ్మ ప్రింట్ అవుతుంది. పరి చేసింది. నేను తెలుసుకున్న కొన్ని విశేషాలు మీ కోసం.

ఐఫిల్ టవర్ ప్యారిస్‌లో సీన్ నది పక్కన నిర్మించిన ఎత్తైన ఇనుప టవర్. ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం. ఈ టవర్ శిఖరం మీద కొత్తగా 2022లో డిజిటల్ రేడియో యాంటెన్నాను పెట్టారట. దీంతో ఆ టవర్ ఎత్తు మరో ఆరు మీటర్లు పెరిగి పూర్తి ఎత్తు 330 మీటర్లకు చేరింది.

దీనిని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి ‘ఈఫిల్ టవర్’ అని పేరు వచ్చింది.

ఈ టవర్‌లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్‌ను వాడుతారు. ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారుట.

ఈ నిర్మాణం 1887, 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు గేట్‌లా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్‌ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని అధికారులు నగరం యొక్క డిజైన్‌లో సరిపడదని చెప్పారు.. తరువాత 1889లో దీన్ని పారిస్‌లో నిర్మించారు.

మొదట్లో ఈఫిల్ టవర్‌ను 20 సంవత్సరాల వరకే ఉంచాలి అనుకున్నారట. (టవర్‌ను కట్టేటప్పుడే సులువుగా కూల్చేలా ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో విజయ చిహ్నంగా అలాగే ఉంచేసారట. అందువల్ల ప్రపంచం అబ్బురపడి చూస్తోంది. రెవిన్యూ కూడా బాగానే ఉంది.

దీనిని నిర్మించేటపుడు ఈఫిల్ 72 మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు.

  • సెప్టెంబరు 10, 1889లో థామస్ అల్వా ఎడిసన్ దీనిని సందర్శించి అక్కడి గెస్ట్ బుక్‌లో సంతకం చేశాడు.
  • 1902లో మెరుపుల ప్రభావంతో టవరు 100 మీటర్ల పైభాగం మొత్తం దెబ్బతిన్నది.
  • 1910లో థియోడర్ ఉల్ఫ్ దీనిని సందర్శించి టవర్‌లో తయారయ్యే ఎనర్జీని అంచనా వేశాడు. ఈ అంచనాల మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు.
  • జనవరి 3, 1956 నాడు జరిగిన ఒక అగ్నిప్రమాదం వలన టవర్ పైభాగం కొంత దెబ్బతిన్నది.

టవర్ మీద చాలాసేపు చలిని ఆస్వాదిస్తూ, వెలుగుల్లో నగరం అందాన్ని చూస్తూ గతంలో వచ్చినప్పుడు సాయంత్రపు వెలుగుల్లో చూసిన అందాన్ని అనుభవాన్ని గుర్తుచేసుకున్నాము.

లిఫ్ట్‌లో కిందకు వచ్చి దూరంగా ఎత్తుగా కనిపిస్తున్న ఈఫిల్ టవర్‌ని చూస్తూ ఉండిపోయాము. ఫోటోలు తీసుకున్నాము. ప్రింటింగ్ కాస్ట్ భయంలేదు కదా, డిజిటల్ యుగంలో వందల పిక్స్ తీసుకున్నా.

అక్కడనుండి హోటల్లో డిన్నర్ చేసి మేమున్న హోటల్‌కి వచ్చాము.

Photos: Mr. D. Nagarjuna

(వచ్చే వారం కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here