[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]
బసెల్ నగరం-1
[dropcap]పా[/dropcap]రిస్ ట్రిప్ ముగిశాక అక్కడ నుండి స్విట్జర్లాండ్ పర్యటన మొదలయింది. పారిస్ నుండి స్విట్జర్లాండ్ లోని ముఖ్యమైన పోర్ట్, పారిశ్రామిక ప్రాంతం అయిన పురాతన చరిత్ర కలిగిన Basel అనబడే పెద్ద నగరానికి బయలుదేరాము.
ఫ్రెంచ్ స్విస్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం కలిగిన TGV Lyria అనే ట్రైన్‌లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న బోగిలో ఎక్కి ప్రయాణం మొదలెట్టాం. ట్రావెల్ టైం 3 గంటల 20 నిముషాలు. హై స్పీడ్ ట్రెయిన్. గంటకి 320 కిలోమీటర్ల వేగం. ట్రైన్‌లో హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ట్రైన్ స్పీడ్‌ని డిస్‌ప్లే చేసే డిజిటల్ బోర్డ్స్ లోపల ఉంటాయి. మన వందే భారత్ ట్రైన్స్‌కి అడ్వాన్స్డ్ వెర్షన్. పంట్రీ కార్ ఉంది. మనమే వెళ్లి తెచ్చుకోవాలి.
బ్యాగేజ్ కోసం వసతి ఉంది. ఆటోమేటిక్ సెన్సార్ బేస్డ్ డోర్స్. ట్రైన్ ట్రావెల్‍లో కంట్రీ సైడ్ చూసే అవకాశం ఉంది. సీనిక్ బ్యూటీ. స్విస్ ప్రాంతం ఎంతో అందంగా ఉంది. ఇండియన్ మూవీస్‌లో సాంగ్ సీన్స్ లొకేషన్ గుర్తుకు వచ్చాయి. రెప్ప వాల్చకుండా చూస్తుండిపోయాను.
Basel లో 3 స్టేషన్స్ ఉన్నాయిట. మేము BBS లో దిగాము. మా అమ్మాయి వెళ్లాల్సిన కాన్ఫరెన్స్ హోటల్ ఏరియాకి దగ్గర. మాకు వేరే హోటల్ బుక్ చేశారు. అది స్టేషన్‌కి చాలా దగ్గర. స్టేషన్ బయట Basel city transport place ఉంది. బస్, ట్రామ్ దొరుకుతాయి. మేము బ్యాగ్స్ డ్రాగ్ చేస్తూ హోటల్‌కు వెళ్ళాము. మాకు ముందుగానే ఈమెయిల్‌లో హోటల్ రూం కీ పాస్ కోడ్ వచ్చింది. హోటల్ లోకి వెళ్ళాలన్నా పంచ్ చెయ్యాలి. హోటల్‌లో 4 ఫ్లోర్‌లో మా రూమ్.
అన్ని facilities ఉన్నాయి, cooking తో సహా. మా పేర్లతో బసెల్ ట్రావెల్ పాస్‌లు ఉన్నాయి. మమ్మల్ని హోటల్‌లో దింపి మా అమ్మాయి వాళ్ళు వారి హోటల్‌కి క్యాబ్‌లో వెళ్ళారు. మేము SBB station లోనే డిన్నర్ కోసం fruits bread లాంటివి కొన్నాము.
Basel కూడా చాలా నీట్‌గా ఉంది. యూరోప్ సిటీస్ అంతా దాదాపుగా అలానే neat గా ఉంటాయి. కొత్త పాత కలయిక కనపడుతుంది.
నెక్స్ట్ డే మేము ready అయి హోటల్ Lobby area లోకి వెళ్ళాము, కాఫీ టీ Breakfast కోసం. మనకి మల్లే ఆప్షన్ ఉండవు. Bread, non veg based food ఐటమ్స్ ఎక్కువ.
అక్కడ నుండి బసెల్ SBB station దగ్గరకు నడచుకుంటూ వెళ్ళాము. మా అల్లుడు మాకు ఎక్కడికి ఎలా రావాలో చెప్పారు. బసెల్ ట్రావెల్ కార్డ్‌తో పాటు వచ్చిన map తీసుకుని వెళ్ళాము.
మేము tram ఎక్కిన స్టాప్ నుండి 3 స్టాప్‌లో దిగాలి. మొదటి సారి కావటంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యాము. ఒక స్టాప్‌లో గూగుల్ map ప్రకారం దిగాలి. నెక్స్ట్ స్టాప్‌లో దిగాము.
చెప్పటం మరిచాను మేము Hyderabad లో ఫ్లైట్ ఎక్కటానికి ముందే మా అందరి ఫోన్స్ లో international roaming activate చేయించుకుని వచ్చాము. యూరోప్‌లో ఫ్రీ సేఫ్ ఇంటర్నెట్ ఉన్న చోట వాడుకుని లేనప్పుడు మా డేటా వాడేవాళ్ళము.
సో, తప్పు స్టాప్‌లో దిగాక కంగరుపడ్డను. మా వారు ధైర్యం చెప్పి హోటల్ లొకేషన్ మళ్ళీ మేమున్న చోటునుండి సెట్ చేసి walking చేస్తూ హోటల్ చేరాము. హోటల్ పక్క స్టాప్. అక్కడొక కోట ద్వారం చూసాము. భలే ఉంది చిన్న కోట. లోపల ఎలా ఉంటుందో అని ముందుకు వెళ్ళాను. లోపల ఒక ఆధునిక కాలనీ ఉంది. ఇలాంటివి మరికొన్ని చూసాము అక్కడ.
‘గేట్ ఆఫ్ స్పాలెన్’ అని కూడా పిలువబడే స్పాలెంటర్ బాసెల్‌ను దాడి నుండి రక్షించడానికి 1356లో కట్టారట.
ప్రస్తుత ద్వారం నిర్మించబడిన ఆరింటిలో మిగిలిన మూడు గేట్లలో ఒకటి.
బాసెల్ నగర గోడలు ఒకప్పుడు స్విస్ నగరం యొక్క మధ్య భాగంలో ఉండేవి. నగరప్రజల సాంద్రత పెరగటంతో, ఈ గోడలు, వాచ్ టవర్స్ 19వ శతాబ్దంలో ఎక్కువగా కూల్చివేశారట. నేటికి పాక్షికంగా మాత్రమే ఉన్నాయి. స్పాలెంటర్ స్విట్జర్లాండ్‌లో మిగిలి ఉన్న అత్యంత అద్భుతమైన నగర ద్వారాలలో ఒకటిగా చెప్పారు.
సెయింట్ ఆల్బన్ గేట్ 1400 సంవత్సరం నాటి గొప్ప నగర కోటలలో భాగం మిమ్మల్ని బాసెల్ యొక్క అత్యంత సుందరమైన చరిత్ర పుటల్లోకి తీసుకు వెళుతుంది.
గేట్‌వేలో, పెద్ద చెక్క తలుపు పక్కన, మీరు ఇప్పటికీ నగర ప్రవేశాన్ని అడ్డుకోవడానికి ప్రమాద సమయాల్లో ఒక్కొక్కటిగా తగ్గించిన భారీ స్తంభాలను చూడవచ్చు. బాసెల్ ప్రజలు దల్బెదూర్ అని పిలిచే నగర ద్వారం సెయింట్ ఆల్బన్ క్వార్టర్‌కు ప్రవేశ ద్వారంట. ఇది ఇరుకైన వీధులు మరియు చారిత్రాత్మక భవనాలతో ఇప్పటికీ మధ్య యుగాలను గుర్తుకు తెస్తుంది. నగరం యొక్క పూర్వపు కోటలలో భాగం, ఈనాటికీ మనుగడలో ఉన్న మూడు పోర్టల్‌లలో ఒకటి. గేట్ గురించి ప్రస్తావన మొదటి రికార్డులు 1230 నుండి ఉన్నాయట. స్మారక చిహ్నం 1356లో భూకంపం కారణంగా పాక్షికంగా ధ్వంసమైంది, ఆపై 1362 మరియు 1374లో పునర్నిర్మించబడింది. ప్రస్తుతం, గేట్ సెయింట్ ఆల్బన్‌కు దారి తీస్తుంది, ఇక్కడ ఇరుకైన, మూసివేసే వీధులతో మధ్యయుగ వాతావరణం అనిపిస్తుందిట.
ఈ ప్రదేశం మేము ఆగి చూసినప్పుడు అక్కడే ఉన్న చిన్న పార్క్ లాంటి దానిలో మా మనమరాలు పరి పాప ఆడుకుంది. అంతే కాదు నేను చెప్పిన St. Alban Gate ని చూస్తూ బొమ్మ గీసింది.
Photos: Mr. D. Nagarjuna
(వచ్చే వారం కలుద్దాం)