[యూరప్‍లో పలు దేశాలను సందర్శించి, తమ యాత్రానుభవాలను వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి.]
బసెల్ నగరం-2
[dropcap]బ[/dropcap]సెల్ (ఫ్రెంచ్: Bâle) స్విట్జర్లాండ్‌కు ఉత్తరాన ఉన్న ఒక నగరం దీనిని కొన్నిసార్లు ఆంగ్లంలో Basle అని పిలుస్తారు. బాసెల్ అని కూడా వ్యవహరిస్తారు.
ఈ నగరం సుమారు 170,000 మంది జనాభాను కలిగి ఉంది. జ్యూరిచ్, జెనీవా తర్వాత స్విట్జర్లాండ్‌లో మూడవ అతిపెద్ద నగరం.
బాసెల్ ఉత్తరాన జర్మనీ, ఫ్రాన్స్; దక్షిణాన బాసెల్-ల్యాండ్ ఖండం సరిహద్దులుగా ఉన్నాయి. రైన్ నది ఈ నగరం గుండా ప్రవహిస్తుంది.
బాసెల్ 999 నుండి 1803 వరకు ప్రిన్స్- బిషప్‌రిక్‌గా ఉన్నారు. 1356 బాసెల్ భూకంపం కారణంగా నగరం చాలా వరకు ధ్వంసమైంది, ఇది సెంట్రల్ యూరోప్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. బాసెల్ 1501లో స్విట్జర్లాండ్‌లో కలిసింది.
బాసెల్ నగరంలో ఉన్న నోవార్టిస్, సింజెంటా, హాఫ్‌మన్-లా రోచె వంటి అనేక రసాయన మరియు ఔషధ కంపెనీలకు ప్రసిద్ధి చెందింది.
దాదాపు 40 మ్యూజియంలుమ్మాయి. బాసెల్‌లో దేశంలోనే అత్యధిక మ్యూజియంలున్నాయి.
Basel Card
మీరు బాసెల్ హోటల్‌లో బస చేస్తే, మీరు Basel Card తో అనేక సాంస్కృతిక మరియు విశ్రాంతి కార్యకలాపాలపై తగ్గింపుల ప్రయోజనం పొందవచ్చు. వ్యక్తిగత అతిథి కార్డ్ బాసెల్ వసతిలో ప్రతి బుకింగ్‌తో ఉచితంగా లభిస్తుంది, వెబ్ యాప్‌గా స్మార్ట్‌ఫోన్‌కు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మర్నాడు మా అమ్మాయి అల్లుడు కాన్ఫరెన్స్ తో బిజీగా ఉన్నారు. మేము మా పరిని తీసుకుని Basel travel card తో సిటీ చూడటానికి బయలుదేరాము. ఆ card తో ట్రావెల్ + మ్యూజియంలు ఆర్ట్ గ్యాలరీలు ఫ్రీ గా చూడొచ్చట. మాకు వీలవలేదు.
మా అమ్మాయి హోటల్ దగ్గర నుండి బయలుదేరి ట్రైన్స్‌లో zigzag గా ట్రావెల్ చేసాము. Shopping banking street చూసాము. దోవలో స్నాక్స్ కొన్ని కొన్నాము.
ఇక్కడ Trams, busses లో డాగ్స్ allowed. యజమానితో పాటుగా ఎక్కి సీట్ కింద పక్కన కూర్చుని చూస్తుంటాయి. మొరగవు. చాలా క్రమశిక్షణతో ఉంటాయి. రకరకాల కుక్కల్ని చూసాము. మాకు డాగ్స్ ఉండటంతో అస్సలు భయం వెయ్యలేదు. లంచ్ టైం కి వెజ్ ఫుడ్ కోసం కొంత వెతుకులాట అయింది. నేను egg కూడా తినను. సో ఇబ్బంది అయింది. చివరకి ఎదురుగా కనబడిన McDonalds కి వెళ్ళాము. ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్ కోసం లైన్‌లో నిలబడ్డాను.
స్విట్జర్లాండ్‌లో మా దగ్గర ఉన్న Euros వారి ఉమ్మడి కరెన్సీ తీసుకోలేదు. Swiss Franks అడిగారు. అందువల్ల క్యాష్ ఉన్నా క్రెడిట్ కార్డ్ వాడల్సివచ్చింది. Europe దేశాల్లో ముఖ్యంగా విదేశాల్లో ఎవ్వరైనా లైన్‌లో నిలబడి తమ వంతు కోసం వేచిచూడాలి. కౌంటర్ దగ్గర ఉన్న వారిలో ఒక స్త్రీ ఇండియన్‌లా అనిపించింది. మా వంతు వచ్చినప్పుడు మా order place చేసి, పే చేశాక ఆమెతో “మీరు ఇండియా నుండి వచ్చారా?” అని అడిగాను.
ఆవిడ “Yes. మీరు?” అన్నారు.
“మేము Hyderabad నుండి వచ్చాము” అన్నాము.
ఆవిడ మమ్మల్ని “మీరు తెలుగు వారా?” అని అడిగారు.
“అవును. మీరు ఎక్కడ నుండి వచ్చారు?” అడిగాను.
“అనంతపూర్. ఆంధ్రప్రదేశ్. మీకు తెలుసా?”
“తెలుసు. చాలా బాగా.”
“మీరు లిఫ్ట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో kids area లో కూర్చుంటారా. వచ్చి కలుస్తాను” అన్నారు.
వచ్చి కలిశారు. ఆవిడ 20 సం క్రితం భర్తతో అక్కడికి వచ్చారట. ఎంతో happy గా మాట్లాడారు. అదేంటో ప్రయాణంలో ఉన్నప్పుడు మనకి దేశమైన విదేశం అయినా మన భాష మాట్లాడేవాళ్ళు పలకరిస్తే పండగే. ఆవిడ పేరు కవిత.
అక్కడ ఒక పార్క్ కనిపిస్తే మా మనవరాలిని తీసుకు వెళ్లి ఆడించాను. దగ్గర్లో కనబడిన ఏషియన్ స్టోర్‌లో వెతికి మరీ ఊరగాయ కొన్నాము. తెలుగు వాళ్ళం కదండీ. ఒకరకంగా అది మమ్మల్ని ఆదుకుంది.
మర్నాడు మేము అల్లుడితో కలిసి బసెల్ జూ కి వెళ్ళాము. చిన్న జూ కానీ చాలా బాగుంది.
రకరకాల చేపల గురించి చెప్పారు. ఆ చేపలు Display లో భలే ఉన్నాయి. పాప బాగా ఎంజాయ్ చేసింది.
ఇంకా విదేశీ పక్షులు జంతువులు బావున్నాయి. జూ మా హోటల్ వెనక వైపే ఉంది.
అక్కడనుండి అందరం లంచ్ కోసం సిటీ ఏరియాలో శ్రీలంక హోటల్‌కి వెళ్ళాము. గూగుల్ మాతకు ధన్యవాదాలు. ఫుడ్ బానే ఉంది.
ఆక్కడ నుండి చుట్టుపక్కల ప్రదేశాలు చూసాము. విండో షాపింగ్ చేశాము.
సిటీ బావుంది. మర్నాడు మా అమ్మాయితో కలిసి అందరం స్విట్జర్లాండ్, జర్మన్ సరిహద్దుల్లో ఉన్న ఒక పెద్ద జలపాతం చూడటానికి వెళ్ళాము. ఆ సంగతులు వచ్చే వారం.
Photos: Mr. D. Nagarjuna
(వచ్చే వారం కలుద్దాం)