[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘ఎవరిని అడగాలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నా[/dropcap]లో నీవు
నీలో నేను
నేను నాలా లేను
నువ్వు నువ్వులా లేవు
నేను నేను కాను
నువ్వు నువ్వు కావు
దినం రాత్రిలా
రాత్రి పగలులా
మారిపోయింది ప్రపంచం
ఎన్నడూ లేని ఆనందం
యేదో తెలీని మైమరపు
కల ఏదో నిజం ఏదో
తెలీని మైకం
ఇదే నా ప్రేమ అంటే
ఎవరిని అడగాలి..