Site icon Sanchika

ఎవరు గొప్ప?

[dropcap]ఆ[/dropcap]దివారం మార్చి 22, 2020.

కరోనా కట్టడికి ప్రధాన మంత్రి లాక్‌డౌన్ ప్రకటన‌. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు దుకాణాల ముందు బారులు కడుతున్నారు. అవసరానికి మించి సరుకులు దాచిపెట్టుకోవాలని ప్రజల్లో కంగారు‌. నేనూ వరుసలో నిలబడి వున్నాను.

పక్కనే వున్న దుకాణంలో పాల పేకెట్టు కొంటూ రిక్షా తొక్కే జావేద్. నేను రోజూ ఆఫీసుకి వెళ్ళడానికి మా కాలనీ పెద్ద గేటు దగ్గర నుంచి బస్ స్టాప్ వరకూ అతని రిక్షాలోనే వెళ్తూంటాను. ఠంచనుగా వచ్చి నన్ను రోజూ తీసుకుపోతూంటాడు. బస్ స్టాప్ వరకూ ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకుంటాము. ఇంకో రిక్షా వచ్చినా వదిలేసి జావేద్ కోసం ఎదురు చూడడం నాకూ అలవాటైపోయింది.

రేపటినుంచి లాక్‌డౌన్ మూలాన్ని ఆఫీసు లేదు. సరే! కానీ మరి జావేద్ సంపాదనో మరి? నా మనసు అదోలా అయిపోయింది. పాల పేకెట్టు తీసుకుని వెళ్ళి పోతూన్న జావేద్‌ని పిలిచి ఓ ఐదు వందల రూపాయల నోటు యిచ్చాను.

“లాక్‌డౌన్ ఖతం అయ్యాక ఇది తీరేదాకా మిమ్మల్ని నా రిక్షాలో తీసుకుపోతా సాబ్, ఘక్రియా!” అని ఎక్కడో పెట్టిన తన రిక్షా కోసం వెనక్కు చూడకుండా పరిగెత్తాడు.

Exit mobile version