ఎవరు గొప్ప

0
1

[dropcap]తి[/dropcap]రుపతి పట్టణంలో మంగళం గ్రామంలో బి.టి.ఆర్. కాలనీలో కచ్చు రోడ్డు ప్రక్కన అమృత అనే చెప్పుల షాపు ఉంది. అందులో రకరకాల బ్రాండ్ చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పుల్లో జాక్ చెప్పుకి చీల తగిలి కొంచెం చినిగిపోయింది. అది చూసి వాక్ చెప్పు ఫెవిక్విక్ తీసుకొచ్చి గట్టిగా అతికిస్తుంది. అప్పటినుండి అవి రెండు ప్రాణస్నేహితులుగా ఉంటాయి.

మరుసటి రోజు ఉదయం పూటంతా సరదాగా గడిచిపోతుంది. అదే రోజు సాయంత్రం కొత్తగా వచ్చిన రాక్ చెప్పు వీళ్ళిద్దరి స్నేహం చూసి కడుపులో కుతకుతా ఉడికిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది.

మరుసటి రోజు రాక్ చెప్పు వాక్, జాక్ చెప్పులతో “నన్ను మీ గ్రూపులో కలుపుకోండి” అన్నది. వెంటనే బాటా చెప్పు “మాకేవరితోనూ అక్కర లేదమ్మా!” అంటుంది. వాక్ చెప్పు “మా షాపులోకి ఎన్నో బ్రాండులు వస్తాయి, పోతాయి, కాని ఈ వాక్, జాక్ లోకల్ బ్రాండ్‌లు అవునా? ” అని అంటుంది. రాక్ “మీ ముఖాలు మండా! ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అద్దంలో చుసుకోన్నారా? ” అని అనుకుంటూ ఎలాగైనా వీళ్ళని విడదియాలని నిర్ణయించుకుంది. సాయంత్రం అందరినీ పిలచి ఒక ప్రోగ్రాం చేస్తున్నట్లు నాటకం ఆడి వాటిని విడదీద్దాం అని ఓ ప్రణాళికను సిద్దం చేసుకొంది.

ఆ ప్రోగ్రాం ఏమిటంటే “ఎవరు అందమైన చెప్పు” అనే అందాల చెప్పుల పోటీ. ఆ పోటీలో అందరూ పాల్గొంటారు. కాని వాక్, జాక్ చెప్పులు చివరి వరుసలో వస్తాయి. పక్కనున్న ఇతర చెప్పులు వాటికి చెప్పుడు మాటలు చెప్పి వారి ఇద్దరి మధ్య గొడవ వచ్చేలా చేస్త్తాయి. వారి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా వాక్ చెప్పు “ మిత్రమా! నేను అందమైన చెప్పుని కాదా?” అంది. జాక్ చెప్పు “నువ్వు కాదు, నేనే అందమైన చెప్పుని” అని అంది. దానికి వాక్ చెప్పు నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. క్రిష్ సినిమాలో కండల హీరో “వాక్ చెప్పులు ప్రపంచంలోనే అందమైన చెప్పులు అంటూ టీ.వి.లో యాడ్ ఇచ్చాడు తెలుసా!” అంది వాక్ చెప్పు. “ఆ విషయం తెలియదు కాని నెంబర్ 1 నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ బాటా అనడంతో పాటు ఎంతో సౌకర్యంగాను ఉంటుంది, అనడం చూడ లేదా” అంది బాటా చెప్పు. వాక్ చెప్పు “నాది తెల్ల కలర్ నా పక్కన తీగలు ఇలా ఇలా ఉంటాయి” అంటూ వగలుపోతుంది.

“నా కలర్ బేబి పింక్, నేనైతే ఎత్తుగా కలర్ కాంబినేషన్‌తో సూపర్‌గా ఉంటాను” అని బదులిచ్చింది. జాక్ చెప్పు. పిచ్చి పట్టిన కుక్కల్లాగా తిట్టుకొంటు, కొట్టుకొంటూ రోడ్డుమమీదకు వెళతాయి.

ఆ పక్కనున్న ఓ కుక్క వాక్ చెప్పుని నోటికి కరచుకొని ఆడుకుంటూ వెళ్లి చిత్తుచిత్తు చేసింది. కొంచెం బాధగా ఉన్నా నేనే అందగత్తె అంటూ బాటా చెప్పు వస్తుంటే లారీవాడు దాన్ని తొక్కించి వెళతాడు.

అప్పుడే ఒక కుర్రాడు డబ డబ అంటూ రాజ్‌దూత్ మీద అలా వచ్చాడు. వాడి కాళ్ళకు కొత్త రాక్ చెప్పు మెరిసి రోడ్డుపై నలిగిపోయి కనిపించిన బాటా చెప్పుని చూసింది. రాక్ “చూసావా? పొగడ్త ఎంత మంచి వారినైనా చెరుస్తుందో, ప్రాణ స్నేహితుల మధ్య కూడా చిచ్చుపెట్టి చలి మంట కాసుకోగలను జాగ్రత్త అంటూ గర్వంగా నవ్వింది. ఆ స్కూటర్ మీద ఉన్న కుర్రవాడికి రాక్ చెప్పులపై మోజు తీరినట్లుఉంది. వాడు వెంటనే ఇంకొక కంపెనీ బూట్లు గురించి ఆలోచిస్తూ ఈ రాక్ చెప్పుల్ని అలా తీసి పెంట కుప్ప లోకి విసిరి వేసాడు. ఇదంతా గమనిస్తున్న వాక్, జాక్ చెప్పులిద్దరు దూల తీరింది దొంగ ముఖం దానికి, తగిన శాస్తి జరిగిదంటూ అంత బాధ లోను నవ్వు కున్నాయి.

ఈర్ష్యా ద్వేషాలు లేని, కుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకోని వారే నిజమైన గొప్ప స్నేహితులు.

***

ఇ. మేఘన,
10వ తరగతి,
జి.ప.ఉ. పాఠశాల,
మంగళం ట్రెండ్స్,
తిరుపతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here