[dropcap]”ఎ[/dropcap]బుడు చూసినా యాపారము, సంపాదన అనే వుంటావు కదనా? ఇందాగంట సంపాంచ్చింది సాల్దా. అదేమిటికి ఆ పాడుపడతావు?” అంటా రమేశన్నని అడిగితిని.
“ఈ పాడుపడకుంటే నా యాపారము ఏదో పోయి పడిపోతుందిరా” అనె అన్న.
“అదెట్ల” అంట్ని.
“రేయ్! ప్లేను కిందనింకా పైనకి గాలి లాకి ఎగరాలంటే శానా గాసి. అది అట్ల పోతా పోతా శానా పైనకి పోయినంక దానిపాటికి అది జోరుగా పోతావుంటుంది. ఇబుడు నా యాపారము కూడా అంతే. దాని పాటికి అది సాగిపోతావుంది. ఇట్లా తబుడు (సమయం) నేను సాలు అనుకొంటే అది కిందకి పడిపోతుందిరా”
“ఓ అదా సమాచారము”
“సమాచారము కాదురా, యాపారము అసలు సూత్రము అదే. ఇదే సూత్రము అన్ని పనుల వాళ్లకి కూడా వర్తిస్తుంది. అయినా నా యాపారాన్ని ఈడ వరకు తీసుకొచ్చేకి ఈ మాత్రం సంపాంచ్చేకి నేను ఎంత గాసి పడిండానో అది నాకి మాత్రమే తెలుసురా” అని చెప్పి పోయా అన్న.
నేనూ అన్న దోవల నడిస్తిని.
***
గాసి = కష్టం