1.
అయినవారికీ
ఆకుల్లో …ఆరోగ్యం…
కానివారికి
కంచాల్లో…మాలిన్యం…!
2.
బాధ్యత
సరిహద్దుల్లో…
త్యాగం
దిగంతాలలో…!!!
3.
డస్ట్ బిన్ లో
పురిటి కందు…
ఆమె త్యాగం
దేశం కోసం కాబోలు…!!!
4.
అమ్మయ్య…
కోరిక చల్లారింది…
న్యాయస్థానాలు
మా చేతుల్లో…!!!
5.
దేవుడా…
బాల్యాన్ని తిరిగి ఇవ్వకు…
చుట్టూ
మృగాళ్లే…!!!
6.
మనసు మొగ్గేసింది
బొమ్మను చూసి…
వెల వెల బోయింది
వెల చూసి…!!!
7.
తినే బియ్యం
సప్తవర్ణాలలో లభ్యం
కన్నీటి సేద్యపు పంట
రక్తవర్ణం!!!
8.
తరతరాల బాన పొట్టకోసం
ముందుచూపే…
రాజకీయం
ఎంతగొప్పది…!!