[dropcap]”దే[/dropcap]వుడు వుండాడని చెప్పితే వీనికి కోపమొస్తుంది. లేదని
చెప్పితే వానికి కోపమొస్తుంది. ఇబుడెట్ల ఈ గాచారము నింకా ఎట్ల
గట్టెకేది” అంటా నారాయణన్నా పక్క చూసే రమేశన్న.
తిమ్మిని బొమ్మ, బొమ్మని తిమ్మి చేసే నారాయణన్నకి ఇదో
లెక్క అని నేను అనుకొంటా వున్నట్లే…..
“సర్వజ్ఞనామధేయము శర్వునకే రావుసింగ
జనపాలునకే యుర్వింజెల్లును తక్కోరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే” అనే రాగము అందుకొనె.
ఆ రాగము ఇనింది తడువు “లేనట్లే వున్నాడు” అని అనీశా
రమేశన్న.
“దేవుడు లేదనే నా వాదమే గెలిసె” అని వాడు ఎగరలాడతా
పొయ.
“పోరా గుగ్గు లేనట్లే వున్నాడు అని అనింది అన్న అంటే
దేవుడు వుండాడని చెప్పింది. గెలిసింది నా వాదమే” అని వీడు
దుమకలాడతా పొయె.
నారాయణన్న కిసకస నగె, రమేశన్న మిసమిసలాడే.
***
గాచారము = గ్రహచారము